Breaking News

'అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్య.. అయినా భారతీ రాజా వినలేదు'

Published on Wed, 06/10/2026 - 16:40

దక్షిణాది సినీ పరిశ్రమ ఓ సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. వెటరన్ డైరెక్టర్‌ భారతీ రాజా(84) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సినీ రంగానికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కోలీవుడ్ స్టార్స్ భారతీ రాజాకు నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన సినీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కేవలం పల్లె అందాలను ప్రేక్షకులకు చూపించడమే కాదు.. నటుడిగా కూడా రాణించారు. దర్శకత్వం వహిస్తూనే తన నటనతో అభిమానులను మెప్పించారు. చివరిసారిగా ఆయన తన కెరీర్‌లో నటించిన సినిమా తుడురుమ్. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తుడరుమ్ చిత్రంలో  స్టంట్ మాస్టర్ పళనిస్వామి పాత్రలో భరతిరాజా కనిపించారు.

అనారోగ్యంతోనే షూటింగ్..

తుడరుమ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లే సమయంలోనే భారతీరాజా అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ మందులు తీసుకుంటూనే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన చిత్ర నిర్మాణ బృందానికి భారం కాకూడదని పట్టుబట్టి మరి.. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని తుడరుమ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి వెల్లడించారు. భారతీ రాజా డైలాగులు గుర్తుంచుకోవడానికి.. రిపీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసుకున్నారు.

భారతిరాజా కెరీర్..

దర్శకుడిగా భారతిరాజా మూవీ మేకింగ్‌ను స్టూడియోల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో సినిమారంగం స్వరూపాన్నే మార్చేసింది.  ఆయన  1977 లో ‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ నటించారు. తమిళ సినిమాకు 'మట్టి వాసన'ను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తన కెరీర్‌లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాకుండా 2004లో పద్మశ్రీ అందుకున్నారు.

 

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం