Breaking News

భద్రకాళి ఆలోచింపజేస్తుంది 

Published on Mon, 09/15/2025 - 04:30

విజయ్‌ ఆంటోనీ హీరోగా ‘అరువి’ ఫేమ్‌ అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన తమిళ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘శక్తి తిరుమగన్‌’. విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్, మీరా విజయ్‌ ఆంటోనీల సమర్పణలో సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. 

తెలుగులో ‘భద్రకాళి’ టైటిల్‌తో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ– ‘‘మార్గన్‌’కు ముందు 11 సినిమాలకు నిర్మాతగా చేశాను. సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ‘భద్రకాళి’. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు విజయ్‌గారి పాత్రకు  కనెక్ట్‌ అవుతారు. 

ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలు కూడా ఉన్నాయి. అరుణ్‌ ప్రభు మంచి కథ రాశారు. తమిళంలో మాత్రమే ‘శక్తి తిరుమగన్‌’ టైటిల్‌ ఉంది. మిగతా అన్ని భాషల్లో (తెలుగు, కన్నడ, హిందీ) ‘భద్రకాళి’ టైటిల్‌తోనే రిలీజ్‌ చేస్తున్నాం. మా ‘మార్గన్‌’ను రిలీజ్‌ చేసిన ఏషియన్‌ సునీల్, సురేష్, రానాగార్లే ‘భద్రకాళి’ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ప్రస్తుత అజయ్‌ ధీషన్‌తో ‘బూకి’, మలయా ళంలో ఓ సినిమా చేస్తున్నాం. ‘బిచ్చగాడు’ కాంబినేషన్‌ విజయ్‌ ఆంటోనీ, శశిగార్లు తమిళంలో ‘నూరు సామి’ సినిమా చేస్తున్నారు. తెలుగులో ‘వంద దేవుళ్ళు’ టైటిల్‌ అనుకుంటున్నాం. మా బ్యానర్‌లో సత్యదేవ్‌తో ‘ఫుల్‌ బాటిల్‌’ సినిమా చేస్తున్నాం’’ అని అన్నారు.   

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)