Breaking News

భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అవికా గోర్‌ సినిమా

Published on Tue, 07/16/2024 - 16:12

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన అవికా గోర్‌ కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన  హారర్ థ్రిల్లర్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్‌లో నటించిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల. అందులో ఆమె నటనకు గాను ఉత్తమ  నటిగా సైమా అవార్డ్‌ దక్కింది. గతేడాదిలో నిర్మాతగా పాప్‌కార్న్ అనే చిన్న సినిమాను ఆమె నిర్మించింది. కానీ, ఆ సినిమా నష్టాలను మిగిల్చింది.  

అవికా గోర్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ నటించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో 'బ్లడీ ఇష్క్‌' అనే హారర్‌ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని విక్రమ్‌ భట్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌లో '1920, రాజ్‌ వంటి హారర్‌ సినిమాలతో ఆయన సూపర్‌ హిట్‌ అందుకున్నారు. తాజాగా ఆయన మరోసారి అదే కాన్సెప్ట్‌తోనే 'బ్లడీ ఇష్క్‌' చిత్రాన్ని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఓటీటీలో ఎప్పుడు విడుదల
బ్లడీ ఇష్క్ సినిమా జులై 26న ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు  హాట్‍స్టార్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హిందీలో ట్రైలర్‌ను కూడా తాజాగా విడుదల చేసింది. అయితే, ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అవికా గోర్‌కు తెలుగు మార్కెట్‌ ఎక్కువని చెప్పవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)