Breaking News

'అతడు' రీరిలీజ్‌.. కలెక్షన్స్‌ అంతా 'గుప్పెడు గుండెల' కోసమే

Published on Sat, 07/26/2025 - 14:23

సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'అతడు' రీరిలీజ్‌ కానుంది. 2005లో విడుదలైన ఈ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా (ఆగష్టు 9) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయభేరి ఆర్ట్ పతాకంపై మురళీ మోహన్‌ నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రానికి రూ. 7 కోట్లకు పైగానే బడ్జెట్‌ అయినట్లు సమాచారం. అయితే, తాజాగా ఒక మీడియా సమావేశాన్ని మేకర్స్‌ నిర్వహించారు. అతడు రీరిలీజ్‌ ద్వారా వచ్చే డబ్బును మహేశ్ బాబు ఫౌండేషన్ కోసం వినియోగిస్తామని ఆయన టీమ్‌ ప్రకటించింది.

మహేశ్ బాబు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన నమ్రత, మహేశ్‌కు వచ్చిందని ఆయన టీమ్‌ తాజాగా పేర్కొంది. మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా అతడు సినిమా ఆగష్టు 9న రీరిలీజ్‌ కానుందన్నారు. ఈ మూవీకి వచ్చే కలెక్షన్స్‌ మొత్తం మహేశ్‌బాబు ఫౌండేషన్‌కు ఉపయోగిస్తామని ఆయన టీమ్‌ తెలిపింది. ముఖ్యంగా చిన్న పిల్లల గుండే ఆపరేషన్స్‌, పేద పిల్లల చదువు కోసం ఈ డబ్బు ఉపయోగిస్తామన్నారు. గతంలో రీరిలీజ్‌ అయిన పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ వంటి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్‌ కూడా ఫౌండేషన్‌ కోసం ఉపయోగించామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మహేశ్‌ బాబు బర్త్‌డే నాడు తను నటించిన సినిమాలలో ఏదో ఒకటి రీరిలీజ్‌ అవుతుంది. తమ అభిమాన హీరో స్థాపించిన ఫౌండేషన్‌ కోసం సాయంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్‌ భారీగా సినిమా చూసేందుకు వెళ్తారు.

మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ గురించి
పేద పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలతో పాటు విద్య, ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సేవలను కూడా మహేశ్‌ ఫౌండేషన్‌ అందిస్తుంది. ఈ సంస్థకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రి రెయిన్‌బోతో భాగస్వామ్యం కలిగి ఉంది. దీనికి అంబాసిడర్‌గా మహేష్ బాబు కొనసాగుతున్నారు.  ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 4,500 కంటే ఎక్కువ ఉచిత గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ట్రస్ట్‌ బాధ్యతలన్నీ నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి చూస్తుంటారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)