Breaking News

ముచ్చటగా  బంధాలే... 

Published on Thu, 04/10/2025 - 05:14

కల్యాణ్‌ రామ్, సయీ మంజ్రేకర్‌ జంటగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు. 

ఈ చిత్రం నుంచి ‘ముచ్చటగా బంధాలే ఇచ్చటనే కలిశాయే...’ అంటూ సాగే రెండో పాటని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. రఘురామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటని హరిచరణ్‌ పాడారు. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌ రామ్‌ తల్లి గురించి చాలా  అద్భుతంగా చెప్పాడు. ఈ సినిమా కోసం నిజాయతీగా చాలా కష్టపడ్డాం... చాలా పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకి జన్మనిస్తుంది. మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. ఈ కథాంశంతో రూపొందిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. ఈ నెల 12న మా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి తమ్ముడు (ఎన్టీఆర్‌) వస్తాడు’’ అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)