amp pages | Sakshi

సంజనతో బుమ్రా పెళ్లి.. హర్ట్‌ అయిన అనుపమ

Published on Tue, 03/16/2021 - 18:48

టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, టీవీ ప్రెజెంటర్‌ సంజన గణేషన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.  కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గోవాలో బుమ్రా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా నుంచి పలువురు ఆటగాళ్లు సహా పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి అనుపమా పరమేశ్వరన్‌ మాత్రం బుమ్రా పెళ్లిపై హర్ట్‌ అయినట్లు ఉంది. దీంతో తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొంటూ..'నా నుంచి దూరంగా ఉండు. ఎందుకంటే ముక్కలైపోయిన నా గుండె నీకు గుచ్చుకొని నొప్పి పెట్టవచ్చు..

అయినా గాయం నయం కావోచ్చేమో గానీ వాటి తాలూకూ మచ్చలు అలాగే ఉండిపోతాయి' అంటూ అనుపమా రెండు రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ఇందులో అనుపమ మనసను గాయం చేసింది బుమ్రానే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఓ మలయాళం స్యాడ్‌ సాంగ్‌ని కూడా షేర్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో పాపం అనుపమా.. అంటూ కొందరు ఆమెను ఓదారుస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్న బుమ్రా పెళ్లాడబోతుంది హీరోయిన్‌ అనుపమా పరమేశ్వర్‌నే అంటూ పలు వార్తలు నెట్టింట​ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.  గతంలో బుమ్రా తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని అనుపమ ప్రకటించడం, ఇటీవల అతడి స్వస్థలం గుజరాత్‌ను ఆమె సందర్శించిన ఫొటోలు షేర్‌ చేయడంతో ఈ మేరకు వదంతులు ప్రచారమయ్యాయి. అయితే వారిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలను అనుపమ తల్లి కొట్టిపారేశారు. వారిద్దరి కేవలం స్నేహితులు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక టీవీ ప్రెజెంటర్‌ సంజన గణేషన్‌ను బుమ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య బుమ్రా గోవాలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి  వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

చదవండి :  (బుమ్రా-సంజూ హనీమూన్; మాల్దీవ్స్‌ అయితే బెటర్‌)
(అయ్యో మయాంక్‌.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్‌ చేసి)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)