అయ్యో మయాంక్‌.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్‌ చేసి

Mayank Agarwal Incorrectly Tags Sanjay Bangar Instead Of Bumrah Wife - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఎట్టకేలకు ఒక ఇంటివాడైన సంగతి తెలిసిందే. టీవీ ప్రెజెంటర్‌ సంజనా గణేషన్‌ను గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పె‍ళ్లికి సంబంధించిన ఫోటోలను బుమ్రా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. తాజాగా టీమిండియా టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ బుమ్రాకు కంగ్రాట్స్‌ చెబుతూ షేర్‌ చేసిన కామెంట్‌ నవ్వులు పూయించింది.

బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపిన మయాంక్‌ పొరపాటున అతని భార్య సంజనాకు బదులుగా.. టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌ చేశాడు. ''కంగ్రాట్స్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. సంజయ్‌ బంగర్‌.. మీ వైవాహిక జీవితం బాగుండాలని.. కలకాలం సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అంటూ కామెంట్‌ చేశాడు. మయాంక్‌ చేసిన పని నెటిజన్లకు నవ్వు తెప్పించింది. అయ్యో మయాంక్‌.. బుమ్రా భార్య పేరు సంజయ్‌ బంగర్‌ కాదు.. ఏదో పొరపాటున పెట్టి ఉంటాడు.. ఈ విషయాన్ని పెద్దది చేయకండి'' అంటూ కామెంట్లు పెట్టారు. అయితే మయాంక్‌ తన ట్వీట్‌ను చూసుకొని వెంటనే దానిని డిలీట్‌ చేశాడు.  కాగా బుమ్రాకు విరాట్‌ కోహ్లి, యువరాజ్‌, హర్భజన్‌, కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజారా సహా పలువురు క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

చదవండి: 
బుమ్రానే బౌల్డ్‌ చేసింది.. ఎవరీ సంజన?!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top