ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు
Breaking News
డబ్బింగ్ పూర్తి
Published on Tue, 10/27/2026 - 04:22
‘భోగి’ మూవీ కోసం తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేశారు సులోచన రాణి. శర్వానంద్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ , డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. సంపత్ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధా మోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 12న విడుదల కానుంది. 1960ల ప్రా రంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు నేపథ్యంతో కథనం సాగుతుంది.
ఇందులో గంగ పాత్రలో శర్వానంద్, కందుల సులోచనారాణిగా అనుపమా పరమేశ్వరన్ , మందారంగా డింపుల్ హయతి నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి తన డబ్బింగ్ వర్క్‌ను అనుపమ పూర్తి చేశారని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Tags : 1