Breaking News

ఇండియాకు ఆస్కార్‌ నిరాశ

Published on Mon, 03/03/2025 - 08:44

97వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘అనూజ’(Anuja) మాత్రమే భారత్‌ నుంచి రేసులో ఉంది. అయితే, ఈ విభాగంలో చివరి వరకు రేసులో ఉన్న ఈ చిత్రానికి నిరాశ ఎదురైంది. అనూజ చిత్రానికి అస్కార్‌ అవార్డ్‌ తప్పకుండా వస్తుందని భావించిన భారత అభిమానులకు నిరాశే మిగిలింది. ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం విభాగంలో  'ఐ యామ్ నాట్ ఎ రోబోట్' దక్షిణ కొరియా  చిత్రానికి అస్కార్‌ అవార్డ్‌ దక్కింది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌లో చూడొచ్చు. ఆస్కార్‌ను దక్కించుకోవడానికి ఐదు చిత్రాలతో పోటీపడుతోన్న అనుజా పోటీ పడింది.

ప్రేక్షకులు మెచ్చే పాత్రలు ఎన్నో చేసిన ప్రియాంక చోప్రా ‘అనూజ’ ద్వారా తన ఉత్తమ అభిరుచిని చాటుకుంది. 97వ ఆస్కార్‌ అవార్డ్‌ల్లో బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘అనూజ’(Anuja) షార్ట్‌ లిస్ట్‌ అయిన సమయం నుంచి అవార్డ్‌ తప్పకుండా వరిస్తుందని భారత అభిమానులు ఆశించారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు మిండి కాలింగ్, గునిత్‌ మోగాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియాంక చోప్రా.

బాలకార్మికులైన పిల్లల బతుకు పోరాటంపై వెలుగులు ప్రసరించిన ఈ లఘుచిత్రానికి ఆడమ్‌ జోగ్రేవ్స్‌ డైరెక్టర్‌. తొమ్మిదేళ్ల అనూజ తన అక్కతో కలిసి ఒక గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. తన భవిష్యత్‌ కోసం పని మానేసి చదువుకోవాలా? కుటుంబం కోసం చదువును త్యాగం చేయాలా? అనే అనూజ జీవితంలోని ఈ సందిగ్ధ స్థితికి ‘అనూజ’ షార్ట్‌ ఫిల్మ్‌ అద్దం పడుతుంది.

దోపిడి ప్రపంచంలో తమ ఆనందం, అవకాశాల కోసం ఆశపడే, పోరాడే ఇద్దరు సోదరీమణుల గురించి చెప్పే కథ ఇది.ప్రౌడ్‌ ఆఫ్‌ దిస్‌ బ్యూటీఫుల్‌ ఫిల్మ్‌’ అంటూ ‘అనూజ’ గురించి తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది ప్రియాంక చోప్రా.‘అనూజ’లో అనన్య షాన్‌ బాగ్‌ (పాలక్‌), సజ్దా పఠాన్‌ (అనూజ), నగేష్‌ బోంస్లే (మిస్టర్‌ వర్మ) నటించారు.  ఈ చిత్రంలో నటించిన సజ్దా పఠాన్‌ స్టోరీ వైరల్‌గా మారడంతో తన జీవితం ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

 

#

Tags : 1

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)