Breaking News

ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్‌ ప్రముఖులు.. అమితాబ్‌ ఆసక్తికర పోస్ట్‌

Published on Wed, 06/29/2022 - 09:28

Amitabh Bachchan Meets Stalwarts Of Cinema Prabhas Nani Nag Ashwin: మన ఫేవరేట్‌ హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఒక చిత్ర పరిశ్రమకు చెందిన మల్టీస్టారర్స్‌ కాకుండా వివిధ సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్‌ ఒకే చోట దర్శనమిస్తే. కన్నులకు ఆహా అనిపిస్తుంది. అలాంటి సంఘటన చోటుచేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చి అభిమానులకు కనులవిందు చేశారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలను రూపొందించింది వైజయంతీ మూవీస్. ఈ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. 

ఈ వేడుకలో అతిరథ సినీ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, నాని, దుల్కర్ సల్మాన్‌, కె రాఘవేంద్ర రావు, ప్రశాంత్‌ నీల్‌, నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరందరు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వీరందరూ కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ బిగ్‌ బీ అమితాబ్ తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. వీరంతా కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ 'సినీ ప్రముఖులతో ఒక సాయంత్రం. సినిమా విశేషాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ రాసుకొచ్చారు. అలాగే ఈ వేడుకకు సంబంధించిన అనుభూతి గురించి ఆయన బ్లాగ్‌లో తెలిపారు. కాగా వైరలైన ఈ ఫొటోను నెటిజన్లు 'పాన్ ఇండియా పిక్‌'గా పేర్కొన్నారు. 
 

ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లోనే ప్రాజెక్ట్‌ కె తెరకెక్కుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. నాని ఇదే బ్యానర్‌లో వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాల్లో నటించాడు. 'మహానటి' సినిమాతో విజయం అందుకున్న దుల్కర్ సల్మాన్‌ ప్రస్తుతం 'సీతరామం' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఈ సంస్థలో వచ్చిన ఎన్నో హిట్‌ సినిమాలకు డైరెక్షన్‌ చేశారు. 

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)