స్టార్‌ హీరోయిన్‌కు ట్విన్స్‌.. వైరలవుతున్న పోస్ట్!

Published on Wed, 03/20/2024 - 17:03

కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది.  అయితే ఇప్పటికే అమలాపాల్‌కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ అమలాపాల్‌కు అభినందనలు తెలిపారు. 

తాజాగా అమలాపాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాపను తన చేతుల్లో ఎత్తుకుని కనిపిచింది. అంతే కాకుండా 'టూ హ్యాపీ కిడ్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే తల్లి కాబోతున్న అమలాపాల్‌ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్ ద్వారా తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారన్న హింట్ ఇచ్చిందా అనే డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అమలాపాల్ తాజా పోస్ట్‌ బట్టి చూస్తే త్వరలోనే ట్విన్స్‌కు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే.

కాగా.. గతేడాది జూన్‌ నుంచే డేటింగ్‌లో ఉన్న అమలాపాల్‌ నవంబర్‌లో జగత్‌ దేశాయ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. కాగా.. టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. గతంలో మలయాళ డైరెక్టర్‌ విజయ్‌ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయిన సంగతి తెలిసిందే. 


 

Videos

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

నో డౌట్ పక్కా సీఎం జగన్

వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం

జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

Photos

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)