Breaking News

యాభై రోజుల్లో 'పుష్ప' రూల్‌ స్టార్ట్‌

Published on Fri, 10/18/2024 - 03:43

పుష్పరాజ్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. 50 రోజుల్లో (డిసెంబరు 6న) ప్రపంచవ్యాప్తంగా పుష్ప రూల్‌ ప్రారంభం కానుందని పేర్కొని, అల్లు అర్జున్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్‌. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ తెరకెక్కుతోంది. 

ఇందులోనూ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటిస్తుండగా సుకుమారే దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబరు 6నే విడుదల చేయనున్నట్లు ప్రకటించి, 50 రోజుల కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అంటూ అల్లు అర్జున్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘పుష్ప–2 ది రూల్‌’ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్‌ ఎదురు చూస్తున్న సినిమా మన తెలుగు చిత్రం కావడం గర్వకారణంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి