Breaking News

Allu Arjun At Nandyal: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌

Published on Sat, 05/11/2024 - 12:10

ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారం స్నేహం.. చెలిమి బంధానికి మరేదీ సాటిరాదని ఎన్నెన్నో పురాణ కథలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ఈ ప్రపంచంలో స్నేహానికి అత్యంత విలువ ఉంది. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్‌ కోరుకున్నారు.

తాజాగా అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల చేరుకున్నారు. వారికి పూలమాలలతో శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు ఆయన అభిమానులు శిల్పా రవి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో  తొలిసారి నంద్యాల నుంచే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీచేశారు. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడు విజయం సాధించాలని మద్ధతు తెలిపారు.

శిల్పా రవిని ప్రజాసేవలో చూడటం తనకు చాలా గర్వంగా ఉందని బన్ని అప్పట్లో తెలిపారు. ఆ  ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డిపై 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి నంద్యాల నుంచే ఎన్నికల బరిలో ఉన్నారు.  ఈ ‍క్రమంలో తన మిత్రుడిని గెలిపించాలని అల్లు అర్జున్‌ తన మద్ధతు తెలిపారు. శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు.

శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి, అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరూ క్లాస్‌మెట్స్‌ కూడా.. అనంతరం రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్‌ మంచి స్నేహితులు అయ్యారు. ఇరు కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాల్లో కూడా వారు పాల్గొంటారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్‌ అని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వార రవిచంద్రారెడ్డి తెలిపారు.

అల్లు అర్జున్‌ ఏమన్నారంటే..
'శిల్పా రవిచంద్రారెడ్డి నాకు గత 15 ఏళ్లుగా మంచి మిత్రుడు. రాజకీయాలకు ముందు ఇద్దరం రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. ఎప్పుడైతే రవి పాలిటిక్స్‌లోకి వచ్చారో ఆ సమయం నుంచి మేము తక్కువగా కలిసే వాళ్లం. 2019లో రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ఒక ట్వీట్‌ చేశాను. కానీ, నాకు అది చాలా తక్కువే అనిపించింది. రవి ఈ ఐదేళ్లలో చాలా కష్టపడ్డాడు. అందుకే నేనే నంద్యాలకు వచ్చాను.  ఈ ఎన్నికల్లో రవి విజయం సాధించి ఇక్కడి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.' అని బన్ని అన్నారు. 


 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు