Breaking News

లోకేశ్‌తో ఫిక్స్‌ 

Published on Thu, 01/15/2026 - 05:23

‘పుష్ప: ది రైజ్‌’ (2021), ‘పుష్ప 2: ది రూల్‌’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్‌. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్‌ టైటిల్‌). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీ ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. 

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ ఎవరి దర్శకత్వంలో నటిస్తారు? అంటే... లోకేశ్‌ కనగరాజ్, సందీప్‌ రెడ్డి వంగా, బాసిల్‌ జోసెఫ్‌ పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఆ అవకాశాన్ని లోకేశ్‌ కనగరాజ్‌ అందుకున్నారు. అల్లు అర్జున్‌ నటించనున్న ‘ఏఏ 23’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాకి దర్శకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ ఫిక్స్‌ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 

బన్నీ వాసు, నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరించ నున్న ఈ మూవీని బుధవారం ప్రకటించారు. ‘‘ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్‌ కలిసి పని చేయబోతున్న ‘ఏఏ 23’ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేలా ఉంటుంది. అల్లు అర్జున్‌ని ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూపించనున్నారు లోకేశ్‌ కనగరాజ్‌. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఈ ఆగస్టులో ఆరంభిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)