Breaking News

రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం

Published on Wed, 12/25/2024 - 14:52

హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను చూసేందుకు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, సుకుమార్‌ వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వారు తెలుసుకున్నారు. ఈ నెల 4న  హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప–2 ప్రీమియర్‌ షోకు అల్లు అర్జున్‌ రావడం, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడటం తెలిసిందే.  ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్‌, అల్లు అర్జున్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

రేవతి కుటుంబానికి అల్లు అ‍ర్జున్‌ పేరుతో అల్లు అరవింద్‌ భారీ సాయం ప్రకటించారు.  శ్రీతేజ ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలని రూ. 1 కోటి అరవింద్‌ ప్రకటించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ రూ. 50 లక్షలు అందించారు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను  తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్‌ రాజుకు అందించారు. రేవతి భర్త భాస్కర్‌తో అల్లు అరవింద్‌ మాట్లాడారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు. 

కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజను పరామర్శించిన అనంతరం అల్లు అరవింద్‌ ఇలా అన్నారు. ' ఈ విపత్తు అనంతరం అబ్బాయి కోలుకుంటున్నాడు. త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నాను. శ్రీతేజ కుటుంబానికి మైత్రీ మూవీస్‌ నిర్మాతలు నవీన్, రవిశంకర్‌తో పాటు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ తరపున మొత్తం రూ.2 కోట్లు ఇస్తున్నాం. ఈ చెక్‌లను ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న దిల్ రాజుకి ఇస్తున్నాం.' అని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు.


 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)