Breaking News

మరోసారి నిరూపించారు 

Published on Sat, 05/17/2025 - 06:16

‘‘సింగిల్‌’ సినిమా రషెస్‌ చూశాక మా గీతా ఆర్ట్స్‌లో మరో రెండు సినిమాలు చేయాలని శ్రీవిష్ణుకి చెక్‌ ఇచ్చాను. మనిషిగా, నటుడిగా తను అంత నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్‌కి వస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అరవింద్‌. శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరో హీరోయిన్లుగా ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగిల్‌’. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. 

శుక్రవారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘సింగిల్‌’ కథని దాదాపు 15 మంది తిరస్కరించారు. వాళ్లందరికీ థ్యాంక్స్‌ (నవ్వుతూ). మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్‌ అయితే బాగుంటుందనుకున్నాను... అదే జరిగింది’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఉపయోగపడింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘సింగిల్‌’ని నా లైఫ్‌లో మర్చిపోలేను’’ అని కార్తీక్‌ రాజు చెప్పారు. ‘‘మా సినిమాకి ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని విద్య, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి తెలిపారు.  

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)