Breaking News

ఆస్కార్‌ రేసులో...

Published on Sun, 10/15/2023 - 04:19

ఆస్కార్‌ రేసులో హిందీ చిత్రం ‘మిషన్‌ రాణిగంజ్‌’ను ప్రవేశపెట్టారు. టినూ సురేష్‌ దేశాయ్‌ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్, పరిణీతీ చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్‌ రాణిగంజ్‌’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ విధంగా లేనప్పటికీ మేకింగ్‌ పరంగా మెప్పించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ బొగ్గు గనిలో వరదలు సంభవించినప్పుడు జస్వంత్‌ సింగ్‌ గిల్‌ అనే ఇంజనీర్‌ 65 మంది కార్మికులను ఏ విధంగా రక్షించాడు? అన్నదే ఈ చిత్రకథ. జస్వంత్‌ సింగ్‌ గిల్‌గా అక్షయ్‌ కుమార్‌ నటించారు.

ఇక 96వ ఆస్కార్‌ అవార్డ్స్‌ పోటీకి జనరల్‌ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్‌ నామినేషన్‌ కోసం ఈ చిత్రం యూనిట్‌ దరఖాస్తు చేసిందని బాలీవుడ్‌ టాక్‌. ఇదే తరహాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కూడా ఆస్కార్‌ రేసులో నిలిచి, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అవార్డు గెలుచుకుంది. మరి.. ‘మిషన్‌ రాణిగంజ్‌’కు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కుతుందా? నామినేషన్‌ దక్కించుకుంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ని తీసుకువచ్చినట్లే ఈసారి ఈ సినిమా తెస్తుందా? అనేది 2024 మార్చిలో తెలిసిపోతుంది. మార్చి 10న ఆస్కార్‌ అవార్డుల ప్రదానం జరగనుంది. మరోవైపు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్‌ కోసం మలయాళ చిత్రం ‘2018’ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)