Breaking News

చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం

Published on Fri, 10/25/2024 - 11:24

ఈ నెల(అక్టోబర్‌ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్‌ చిరంజీవిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు అమితాబ్‌ బచ్చన్‌ను కూడా ఈ వేడుకకు  ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఎక్స్‌ వేదికగా నాగార్జున తెలియజేశారు.  

భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2006లో ఏఎన్నార్‌ అవార్డులను ప్రారంభించారు. మధ్యలో రెండేళ్ల గ్యాప్‌ ఇచ్చి.. 2014 తిరిగి అమితాబ్‌ బచ్చన్‌కు ఈ అవార్డు అందజేశారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్‌ వచ్చింది. 2016లో జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరికి ఏఎన్నార్‌ అవార్డు ఇచ్చారు. 

ఆ తర్వాత రాజమౌళి, శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డులు అందుకున్నారు. ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డును అందజేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియో జరగబోతున్న ఈ వేడుకల్లో అమితాబ్‌ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోబోతున్నారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)