వారం రోజులు ఆలస్యంగా...

Published on Sun, 07/20/2025 - 02:25

కాస్త ఆలస్యంగా థియేటర్స్‌కు వస్తానంటున్నారు నార్త్‌ సర్దార్‌. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సన్నాఫ్‌ సర్దార్‌ 2’. ఈ చిత్రంలో పంజాబీ అమ్మాయిగా హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. రవికిషన్, సంజయ్‌ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. అజయ్‌ దేవగన్, జ్యోతిదేశ్‌ పాండే, ఎన్‌ఆర్‌ పచిసియా, ప్రవీణ్‌ తల్రేజా నిర్మించారు. కాగా ఈ సినిమాను జూలై 25న రిలీజ్‌ చేయాలనుకున్నారు.

కానీ వాయిదా వేశారు. ‘సన్నాఫ్‌ సర్దార్‌ 2’ సినిమా ఈ నెల 25న విడుదల కావడం లేదని, ఆగస్టు 1న రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. ఈ వాయిదాకి కారణం ‘సయారా’ సినిమా. అహన్‌ పాండే, అనీత్‌ పద్దా హీరో హీరోయిన్లుగా నటించిన ‘సయారా’ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఈ సినిమాతో పోటీ ఎందుకని అజయ్‌ దేవగన్‌ తన సినిమాను ఆగస్టు 1కి వాయిదా వేసుకున్నారు.

ఈ సంగతి ఇలా ఉంచితే... రాజమౌళి దర్శకత్వంలో సునీల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన హిట్‌ ఫిల్మ్‌ ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా రూపొందిన అజయ్‌ దేవగన్‌ ‘సన్నాఫ్‌ సర్దార్‌’ సినిమా 2012లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సన్నాఫ్‌ సర్దార్‌ 2’ రూపొందింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)