Breaking News

నెక్స్ట్ 100 కోట్ల స్టార్ హీరో అత‌డే!

Published on Thu, 04/11/2024 - 00:22

కంటెంట్ ఉంటే హీరో క‌టౌట్‌తో ప‌నిలేకుండా సెంచ‌రీలు కొట్టేస్తున్న రోజులివి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్‌లో కొత్త ఆటగాళ్లు ఎలా దంచికొడుతున్నారో.. సినిమాల్లోకి కొత్త‌గా వ‌చ్చిన హీరోలు కూడా అలాగే వ‌సూళ్ల‌తో ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ చిత్రం విజ‌యం సాధించడంతో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన విషయం తెలిసిందే. సిద్దు సెంచ‌రీ కొట్టడంతో టిల్లు క్యూబ్‌ అంటూ తన తదుపరి చిత్రంపై కూడా మరింత అంచనాలను పెంచగలిగాడు.

ఆ ర‌కంగా సిద్దు ఇండ‌స్ట్రీలో త‌న‌ని తానే సెంచ‌రీ స్టార్‌గా తీర్చిదిద్దుకున్నాడు. టిల్లుతో త‌న‌లో ఉన్న రైటింగ్ స్కిల్స్ అత‌న్ని 100 కోట్ల హీరోగా తీర్చి దిద్దడంలో కీల‌క పాత్ర పోషించాయి అన్న‌ది వాస్త‌వం. అయితే ఇత‌డి కంటే ముందు తేజ స‌జ్జ హ‌నుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించాడు.

అలాగే హీరో నాని ద‌స‌రా చిత్రంతో 100 కోట్ల క్ల‌బ్‌లో చేరాడు.గీత‌గోవిందంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఎఫ్-2 తో వ‌రుణ్ తేజ్, 100 కోట్ల క్ల‌బ్‌లో చేరగా.. కార్తికేయ‌-2 తో నిఖ‌ల్ వంద కోట్లు సాధించడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. 

ఇక తన తొలి సినిమా ఉప్పెన చిత్రంతోనే మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కూడా వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరిన‌ వాడే. మ‌రి ఈ రేసులో త‌దుప‌రి సెంచరీ కొట్టే స్టార్ ఎవరు? అంటే ఆ ఛాన్స్ అడివి శేష్‌కు ఉంద‌ని చెప్పొచ్చు. గతంలో శేష్‌ నటించిన గుఢ‌చారి, హిట్-2, ఎవ‌రు, మేజ‌ర్ లాంటి సినిమాలతో అడ‌వి శేష్‌ పేరు సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాలు 50-60 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించాయి. మేజ‌ర్ పాన్ ఇండియా స్థాయిలో హిట్‌గా నిలిచి 60 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

ప్ర‌స్తుతం శేష్‌ గుఢ‌చారి-2 లో న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాలతో నటనతో పాటు రైటింగ్‌లో కూడా శేష్‌కు అపార అనుభ‌వం ఉంది. త‌న‌ని స్టార్‌గా మార్చుకోవ‌డంలో రైటింగ్‌ స్కిల్ అత‌డికి ఎంతో ఉప‌యోగపడుతోందని చెప్పాలి. గుఢ‌చారి-2 తో అడివి శేష్‌ 100 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెడ‌తాడు అనే అంచ‌నాలున్నాయి. ట్రేడ్ సైతం ఈ సినిమాతో సాధ్య‌మ‌ని భావిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)