Breaking News

నాపై కాంగ్రెస్‌ తప్పుడు ఆరోపణలు.. సిగ్గనిపించడం లేదా: ప్రీతి జింటా

Published on Tue, 02/25/2025 - 15:08

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌, పంజాబ్‌ జట్టు యజమాని ప్రీతి జింటా (Preity Zinta) కాంగ్రెస్‌ (Congress) పార్టీపై భగ్గుమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ఆమె పేర్కొన్నారు. న్యూ ఇండియా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ నుంచి ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాపీ చేసిందని కేరళ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకు గాను ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారని ఆ పార్టీ పేర్కొంది. అయితే, ఇదే విషయంపై ప్రీతి జింటా ఫైర్‌ అయ్యారు.

'నా సోషల్‌మీడియా అకౌంట్స్‌ అన్నీ సొంతంగానే నిర్వహించుకుంటాను. మరోకరికి అప్పగించలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉంది. 10ఏళ్ల కిందటే ఆ బ్యాంకు నుంచి తీసుకొన్న రుణాన్ని తీర్చేశాను. ఇన్నేళ్ల తర్వాత ఈ అంశపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోస్ట్‌ చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను తీసుకున్న రుణాన్నీ ఎవరూ మాఫీ చేయలేదు. ఆ అవసరం నాకు లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి. పూర్తి విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. సాధారణంగా ఇలాంటి రూమర్స్‌కు నేను రియాక్ట్‌ అవను. కానీ, భవిష్యత్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వివరణ ఇస్తున్నాను.' అని ప్రీతి జింటా తెలిపారు.

న్యూఇండియా కోఆపరేటివ్ ముంబై బ్రాంచ్‌లో ప్రితీ జింటా లోన్‌ తీసుకున్నట్లు తెలిపారు. అదే బ్యాంక్‌లో  జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్‌గా పనిచేస్తున్న హితేష్ మెహతా  రూ.122 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన్ను ముంబై పోలీసులు  కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే  ప్రీతి జింటాపై కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేసింది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)