Breaking News

కాబోయే భర్తను పరిచయం చేసిన నివేద పేతురాజ్‌

Published on Thu, 08/28/2025 - 07:27

తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్‌(Nivetha Pethuraj). త్వరలో వివాహం చేసుకోబోబుతున్నట్లు ప్రకటించేశారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఫోటోలు షేర్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే వారికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. 

నివేదకు కాబోయే భర్త పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్‌..  అతను దుబాయ్‌లో బిజినెస్‌ మ్యాన్‌ అని తెలుస్తోంది. కొంతకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఈ విషయం బయటిప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ తర్వాత అందరికీ శుభవార్త చెప్పారు.  ఇదే ఏడాదిలో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయం గురించి మరిన్ని విషయాలు ఆమె చెప్పనున్నారు.

తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్.. 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే 'మెంటల్ మదిలో' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం తదితర సినిమాలు చేసింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈమె ఏం మూవీస్ చేస్తుందనేది తెలీదు.

కారు రేసర్‌గా విజయం.. సీఎం స్టాలిన్‌ కుమారుడితో రూమర్స్‌
నటన-మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కారు రేసింగ్‌లో కూడా సత్తా చాటింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్‌షిప్ పోటీలోని మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

నివేదా పేతురాజ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్   50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం  ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ విషయం తెలుసుకున్న  నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. తప్పుడు వార్తలతో బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించానని చెప్పింది.
 

#

Tags : 1

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)