ఆ హీరోయిన్‌ను చూశాక నా ఆలోచన మార్చుకున్నా: లక్ష్మీ మంచు

Published on Sun, 02/23/2025 - 18:34

జిమ్‌లో శ్రీదేవిని అలా చూసినప్పటి నుంచి నా మనసు మార్చేసుకున్నాను అంటోంది సినీనటి మంచు లక్ష్మి (Lakshmi Manchu). తాజాగా ఆమె చేసే బ్యూటీ విత్‌ లక్ష్మి టాక్‌ షోకు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ భార్య మహీపా కపూర్‌ హాజరైంది. వీరిద్దరూ అందం, ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.

ట్రెడ్‌మిల్‌పై శ్రీదేవి
శ్రీదేవి (Sridevi)ని ఓసారి జిమ్‌లో చూశాను. తను ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతోంది. అప్పుడు జిమ్‌ లోపలికి అడుగుపెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాను. శ్రీదేవి తన జుట్టుకు ఒత్తుగా నూనె పట్టించి ఉంది. అది చూసి షాకయ్యాను. దక్షిణ భారతదేశంలో తలకు నూనె పెట్టుకోవడం అనేది చాలా సాధారణ విషయం. ఎందుకో కానీ, జుట్టుకు నూనె పెట్టుకోవడాన్ని నేనసలు ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడైతే శ్రీదేవిని అలా చూశానో సడన్‌గా నా మనసు మారిపోయింది. 

శ్రీదేవికి అన్నీ తెలుసు
అంత గొప్ప నటి శ్రీదేవియే జుట్టుకు నూనె రాసుకుందంటే చాలా గొప్ప విషయం అనిపించింది. తనెప్పుడూ సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుంది అని చెప్పుకొచ్చింది. మహీరా కపూర్‌ మాట్లాడుతూ.. శ్రీదేవికి ఏం చేయాలి? ఏది తినాలి? అన్నీ తెలుసు. ఇలాంటి విషయాల్లో ఆమె జీనియస్‌ అని పేర్కొంది. ఇకపోతే లక్ష్మీ మంచు చివరగా ఆదిపర్వం సినిమాలో కనిపించింది.

చదవండి: అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా!

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)