Breaking News

పాముతో సీన్స్‌ చేయడానికి భయపడ్డాను

Published on Thu, 04/03/2025 - 06:02

హీరోయిన్‌ కేథరిన్‌ ట్రెసా ప్రధాన పాత్రలో, మహేశ్‌ శ్రీరామ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫణి’. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, ఏయూ అండ్‌ ఐ స్టూడియోల సమర్పణలో డా. మీనాక్షి అనిపిండి ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రెస్‌మీట్‌కు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై, ‘ఫణి’ సినిమా మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వీఎన్‌ ఆదిత్య కొత్త వాళ్లతోనూ సినిమా చేయగలడు, స్టార్స్‌తోనూ సినిమా చేయగలడు. ‘ఫణి’ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘నాకు పాములంటే భయం. దీంతో పాముతో నేను చేయాల్సిన సీన్స్‌ అన్నీ సీజీలో చేయాలని ఆదిత్యగారిని రిక్వెస్ట్‌ చేస్తే, సరే అన్నారు. అయితే షూటింగ్‌ చివర్లో పాము కాంబినేషన్‌లో నాతో సీన్స్‌ చేయించారు. ఒకసారి సీన్‌ పూర్తయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. అప్పుడు నా ఫీలింగ్‌ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. మేలో మా ‘ఫణి’ మూవీని రిలీజ్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు కేథరిన్‌. 

‘‘యూఎస్‌ వెళ్లినప్పుడు నా సోదరి మీనాక్షి–బావ శాస్త్రిగారి ఇంట్లో ఉంటాను. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తామన్నప్పుడు నాకు భయం వేసింది. ‘ఫణి’ చిత్రాన్ని చిన్నగా మొదలు పెట్టాం. ఆ తర్వాత కేథరిన్‌గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది’’ అన్నారు వీఎన్‌ ఆదిత్య. ‘‘ఫణి’ మూవీతో కేథరిన్‌గారికి జాతీయ అవార్డు వస్తుంది’’ అని తెలిపారు నిర్మాత, సంగీత దర్శకురాలు డా. మీనాక్షి అనిపిండి. ‘‘హాలీవుడ్‌లో మోడలింగ్, మూవీస్‌ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించడంతో సొంత ఇంటికి వచ్చినట్లుంది’’ అన్నారు మహేశ్‌ శ్రీరామ్‌. ఈ చిత్రసమర్పకుడు పద్మనాభరెడ్డి, సహ–నిర్మాత శాస్త్రి అనిపిండి, రైటర్‌ పద్మ, నటుడు కాశీ విశ్వనాథ్‌ మాట్లాడారు.  

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)