Breaking News

తాత, తండ్రి, కొడుకు..‘అక్కినేని’మూడు తరాలతో నటించిన ఏకైక హీరోయిన్‌ ఈమే!

Published on Wed, 09/17/2025 - 17:02

చిత్రపరిశ్రమలో హీరోలకు వయసుతో సంబంధం ఉండదు కానీ..హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఉంటుంది. 30-35 ఏళ్లు దాటితే చాలు చాన్స్‌లు తగ్గుతాయి. అలా పట్టుమని పదేళ్లు కూడా హీరోయిన్‌గా రాణించలేరు. వయసు ఉన్నా.. ఖాతాలో హిట్‌ లేకపోతే అంతే సంగతి. వరుసగా 3-4 ఫ్లాపులు పడ్డాయంటే.. ఇక ఆమె వెండితెరపై మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లు చాలా తక్కువే ఉన్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్‌ స్పాన్‌ 20 ఏళ్ల వరకు ఉండేది. భారీ హిట్స్‌ వస్తే..ఆమెను నెత్తినపెట్టుకొని ఆరాధించేవాళ్లు. హీరోలతో సమానంగా వాళ్లకు అభిమానులు ఉండేవాళ్లు. అలాంటి వాళ్లలో రమ్యకృష్ణ(Ramya Krishnan) ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె హీరోయిన్‌గా నటించింది.

13 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.  తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్‌ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. . మె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). చిరంజీవి,నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణ, మోహన్‌ బాబు, రాజేంద్రప్రసాద్‌..ఇలా అప్పటి స్టార్‌ హీరోలందరితోనూ ఆమె స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. అంతేకాదు ‘అక్కినేని’ హీరోలందరితోనూ నటించిన రికార్డు ఆమె పేరిట ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలు అఖిల్‌ వరకు.. మూడు తరాలతో రమ్యకృష్ణ కలిసి నటించింది.

అక్కినేని నాగేశ్వరరావుతో ‘దాగుడు మూతలు దాంపత్యం, ఇద్దరే ఇద్దరు, సూత్రధారులు సినిమాల్లో కలిసి నటించింది. ఇక నాగార్జునతో ఆమె 10కి పైగా సినిమాలు చేసింది. అందులో హల్లో బ్రదర్‌, సంకీర్తన, చంద్రలేఖ, అన్నమయ్య, అల్లరి అల్లుడు లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కూడా ఉన్నాయి. 

ఇక అక్కినేని మూడో తరం.. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యతోనూ రమ్యకృష్ణ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. శైలజా రెడ్డి సినిమాలో చైతుకి అత్తగా, బంగార్రాజు చిత్రంలో నానమ్మగా నటించింది. 

 నాగ్‌ చిన్న కొడుకు అఖిల్‌ ‘హలో’ మూవీలోనూ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఇలా అక్కినేని మూడు తరాలతో నటించిన ఏకైన హీరోయిన్‌గా రమ్యకృష్ణ నిలిచింది. సమంత కూడా ఈ నలుగురితో కలిసి ‘మనం’ సినిమాలో నటించింది. అయితే విడివిడిగా నటించిన ఏకైక నటి మాత్రం రమ్యకృష్ణ అనే చెప్పాలి.

 

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే