Breaking News

అది మూడు సెకన్ల సీన్‌.. ఇంత గోల ఏంటి: నటి

Published on Sat, 05/31/2025 - 09:36

'థగ్‌ లైఫ్‌' సినిమా ట్రైలర్‌ విడుదల తర్వాత  మూడు సెకన్ల సీన్‌పై పెద్ద చర్చే జరిగింది. 70 ఏళ్ల కమల్ హాసన్, 42 ఏళ్ల అభిరామి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ట్రైలర్‌లో కనిపించడంతో చాలా విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, జాతీయ వార్తా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి అభిరామి తొలిసారి మాట్లాడింది.  ట్రైలర్‌లోని సన్నివేశం కేవలం మూడు సెకన్ల నిడివి మాత్రమే ఉందని, దాని గురించి ఇంత వివాదం సృష్టించడం అనవసరమని నటి అభిరామి పేర్కొంది.

థగ్‌ లైఫ్‌ ప్రమోషన్స్‌లతో బిజీగా ఉన్న అభిరామి ఆ సీన్‌ గురించి ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో ఏదైనా క్షణాల్లోనే వివాదంగా మారవచ్చు. మనం దాని నుంచి తప్పించుకోలేము. దర్శకులు మణిరత్నం సార్ నన్ను ఆ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారో నేను ఆయన్ను ప్రశ్నించను.  సినిమా విషయంలో వారి నిర్ణయం ఏదైనా సరే నేను దానిని అంగీకరిస్తున్నాను. పూర్తి నా ఇష్టంతోనే ఆ సీన్‌ తీశారు. ఇది కేవలం మూడు సెకన్ల దృశ్యం. కానీ, ట్రైలర్ వల్ల కొన్ని అపార్థాలు ఏర్పడ్డాయి. సినిమాలోని ఆ సన్నివేశంతోనూ, లిప్‌లాక్‌కు దారితీసే విషయాలతోనూ చాలా లింక్‌ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఎవరూ అలాంటి కామెంట్లు చేయరని అనుకుంటున్నాను. అది ఆ సన్నివేశానికి బాగా సరిపోతుందనే చేశాం. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. వారు ముందు సినిమా చూడాలని నేను అభ్యర్థిస్తున్నాను' అని అభిరామి అన్నారు.

కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతున్న 'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఈ చిత్రంలో శింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, నాసర్, అశోక్ సెల్వన్,అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ నిర్మించారు.కమల్ హాసన్, మణిరత్నం 37 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న ఈ చిత్రం జూన్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)