Breaking News

సింగర్‌ చిన్మయిపై ట్రోల్స్‌ మొదటిసారి స్పందించిన రాహుల్‌

Published on Sat, 07/01/2023 - 12:58

ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్‌ ఆపేయండని  ఆమె భర్త నటుడు రాహుల్‌ వవీంద్రన్‌ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్‌ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్‌ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్‌ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్‌ చేస్తూ.. రాహుల్‌  ఖాతాను ట్యాగ్‌ చేయడంతో ఆయన ఒక నోట్‌ విడుదుల చేశారు.

(ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి)

'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్‌ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్‌లో తెలిపారు. రాహుల్‌ పోస్ట్‌పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్‌ కామెంట్లు పెట్టారు.

(ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్‌ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!)

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)