Breaking News

చలి వల్ల ఇబ్బంది పడుతున్నా.. ప్లీజ్‌ ఒక దుప్పటి ఇవ్వండి

Published on Thu, 11/20/2025 - 08:13

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌ను  57వ సీసీహెచ్‌ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. దర్శన్‌ నీలం రంగు టీ షర్ట్‌, నల్ల ప్యాంట్‌ ధరించి హాజరయ్యారు. అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయాలని దర్శన్‌ తరఫు న్యాయవాదికి సూచించారు. జైలులో చలి ఎక్కువగా ఉన్నందున ఇంటి నుంచి తెచ్చిన దుప్పటిని కప్పుకోవడానికి ఇప్పించాలని ఆయన కోరారు.

మరో నిందితుడు నాగరాజు కూడా ఇదే కోరాడు. అయితే, జడ్జి ముందు దర్శన్‌ ఇలా వాపోయాడు. 'చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర పోవడమే సాధ్యం కావడం లేదు. చాలా ఇబ్బందిగా  ఉంది. కనీసం అదనంగా ఒక కంబళి ఇప్పించండి.' అని  వేడుకున్నాడు. అయితే, జైలు అధికారుల తీరుపై జడ్జి మండిపడ్డారు. 'చలి ఎక్కువగా ఉన్నప్పుడు అదనంగా కంబళి ఇవ్వాలి కదా.. ఇప్పటికే ఆదేశించాం కదా.. పదేపదే ఎందుకు చెప్పించుకుంటున్నారు..? నిందితులకు కావలసిన అదనపు కంబళ్లను ఇవ్వండి.' అని  న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను డిసెంబర్‌ 3కు వాయిదా వేశారు.

జైలు వీడియోల కేసులో భార్య పేరు
పరప్పన జైల్లో ఖైదీలకు రాచమర్యాదల వీడియో లీకేజీలో దర్శన్‌ సతీమణి విజయలక్ష్మి పేరు బయటకు వచ్చింది. దర్శన్‌ మిత్రుడు, నటుడు ధన్వీర్‌ను వీడియోల గురించి పోలీసులు విచారిస్తున్నారు. మొదట ఆ వీడియో న్యాయవాది ద్వారా తనకు రాగా, అదే వీడియోను తాను దర్శన్‌ భార్యకు పంపానని ధన్వీర్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. తాను ఈ వీడియోలను వైరల్‌ చేయలేదు, ఎవరు చేశారో తెలియదని పేర్కొన్నట్లు తెలిసింది. ఆమెకు కూడా నోటీసులిచ్చి విచారించాలని పరప్పన అగ్రహార పోలీసులు నిర్ణయించారు. ఈ వీడియోలను ఎవరు అప్‌లోడ్‌ చేశారో చెప్పాలంటూ ఫేస్‌బుక్‌కు పోలీసులు ఈ మెయిల్‌ ద్వారా అడిగినట్లు తెలిసింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)