Breaking News

'నేషనల్‌ అవార్డ్స్‌.. రేసులో స్టార్‌ హీరో

Published on Fri, 08/16/2024 - 08:53

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు సాయింత్రం ప్రకటించనుంది.  2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించనుంది. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నేడు (ఆగష్టు 16) జాతీయ అవార్డు అందుకోనున్న వారి జాబితా మాత్రం విడుదల అవుతుందని సమాచారం ఉంది.

ఎంపిక విధానం
2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్‌ను అందిస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. దీంతో  2022కు సంబంధించిన సినిమాలకు నేడు విన్నర్స్‌ జాబితా విడుదల అవుతుంది. ఇదే ఏడాది అక్టోబర్‌లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్‌ను వారు అందుకుంటారు. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు మాత్రమే ఈ అవార్డుల పోటీకి అర్హత పొందాయి.

ఉత్తమ హీరో రేసులో ఎవరున్నారు..?
70వ జాతీయ అవార్డు వేడుకలో ఉత్తమ హీరోగా ఎంపిక అయింది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే, మమ్ముట్టి, రిషబ్‌ శెట్టి, విక్రాంత్ మాస్సే మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ రోషాక్‌, నాన్ ప‌క‌ల్ నేర‌త్తు మ‌యక్కం అనే రెండు సినిమాలతో మమ్ముట్టి టాప్‌లో ఉన్నారు. కాంతార సినిమాతో రిషబ్‌ శెట్టి ఉంటే... 12th ఫెయిల్‌ సినిమా ద్వారా విక్రాంత్ మాస్సే తర్వాతి స్థానంలో ఉన్నారు. 

బాలీవుడ్‌ నుంచి పోటీలు ఉన్న ఏకైక హీరోగా ఆయన రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. అయితే, ఈసారి కూడా సౌత్‌ ఇండియా హీరోకే అవార్డ్‌ దక్కుతుందని తెలుస్తోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ హీరోగా అవార్డ్‌ అందుకున్న విషయం తెలిసిందే.

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)