Breaking News

మోహన్‌బాబు@50

Published on Fri, 11/22/2024 - 01:47

నటుడు–నిర్మాత మంచు మోహన్‌బాబు సినీ జర్నీ గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌లోకి అడుగుపెట్టింది. యాభై ఏళ్ల కెరీర్లో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో ఘనవిజయాలను చూశారు మోహన్‌బాబు. నేటితో సినీ పరిశ్రమలో హీరోగా 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 

సినిమాల్లోకి రాక ముందు ఆయన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా చేశారు. అయితే సినీ పరిశ్రమపై ఎనలేని ఆసక్తితో మద్రాస్‌ వెళ్లి, అవకాశాల కోసం ఎంతో శ్రమించారు మోహన్‌బాబు. అలా ఒకట్రెండు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన మోహన్‌బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘స్వర్గం నరకం’ (1975). డా. దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

 నవంబరు 22న విడుదలైన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమా విడుదలై, గురువారంతో నలభైతొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ‘స్వర్గం నరకం’తో హీరోగా వెండితెరకు పరిచయమైన మోహన్‌బాబు కెరీర్‌ మొదట్లో ఎక్కువగా విలన్‌ పాత్రలనే పోషించారు. 1975–1990 సమయంలో విలన్‌గా విజృంభించారు. హీరోగా ‘అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, మేజర్‌ చంద్రకాంత్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందుకున్నారు. 75 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్‌బాబు. విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)