నాగేశ్వరరావు కోసం ఐదుగురు స్టార్స్‌

Published on Sun, 07/02/2023 - 05:04

హీరో రవితేజ సినిమాకి రెండోసారి మాట ఇచ్చారు హీరో వెంకటేశ్‌. రవితేజ నటించిన ‘క్రాక్‌’ (2021)కి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన వెంకటేశ్‌.. తాజాగా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రానికి ఇచ్చారు. వంశీ దర్శకత్వంలో రవితేజ టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ఇది. ‘‘అది 70వ దశకం. బంగాళాఖాతం తీరప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. దడదడ మంటూ వెళ్లే రైలు ఆప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనబడితే జనం అడుగులు తడబడతాయి.

దక్షిణ భారతదేశపు నేర రాజధాని.. ‘స్టూవర్టుపురం’. ఆప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది.. ‘టైగర్‌ జోన్‌’. ద జోన్‌ ఆఫ్‌ టైగర్‌ నాగేశ్వరరావు..’ అంటూ టైగర్‌ నాగేశ్వరరావు చరిత్రని తన వాయిస్‌తో వెంకటేశ్‌ పరిచయం చేసిన తీరు సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్‌ వీడియోకు హిందీలో జాన్‌ అబ్రహాం, కన్నడలో శివ రాజ్‌కుమార్, తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగగా ముద్రపడిన నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్‌ 20న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)