Breaking News

క్షణికావేశం వద్దు : మనసులు విరిగితే మాటలు కలపాలి

Published on Thu, 02/26/2026 - 15:00

రాయవరం: రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఆరంభమయ్యే దాంపత్య జీవితం కలకాలం పచ్చగా ఉండాలనే అందరూ ఆకాంక్షిస్తారు. పరిస్థితుల ప్రభావం, మనస్పర్థలు వంటివి ఆ పచ్చని సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ సూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఏమైపోతారో అనే ఆలోచించకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 

ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. భర్తను భార్యో, భార్య భర్తనో చంపడమో లేదా చంపించడమో జరుగు తున్నాయి. మనిషి నైతిక విలువలను మరచి దిగజారిపోతున్నాడు. అలా కాకుండా సమస్యను సానుకూలంగా ఆలోచించి నా మనిషేకదా అనుకుంటే సగం పరిష్కారం అయినట్టే. ఆ తరువాత మనసులు నెమ్మదించి మాటలు కలిసి చిలక పలుకులతో చర్చించుకుంటే మళ్లీ ఆ పాత రోజులు నిత్య నూతనాలవుతాయి.  

అనుమానం పెనుభూతమై  
బిక్కవోలు మండలం రంగాపురంలో ఒకడు తన భార్యను ఈ నెల 19న హత్య చేశాడు. దీంతో వారి చిన్నారులు తల్లిలేని వారయ్యారు. అలాగే ఈ నెల 17న ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మరొకడు అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేశాడు.  
సమస్యలు ఎదురైనప్పుడు వీరిని సంప్రదించవచ్చు 
గృహ హింస నిరోధక చట్టం (2006): మహిళలను శారీరకంగా హింసించడం, గాయపర్చడం, ప్రాణా లకు హాని తలపెట్టడం, మాటలతో మానసికంగా ఒత్తిడి పెంచడం తదితర ఇబ్బందులకు గురి చేస్తే గృహ హింస అవుతుంది. ఇలాంటి సమయంలో బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఉచితంగా న్యాయసేవలు : కుటుంబాల్లో గొడవలు, వివాదాలను పరిష్కరించుకునేందుకు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలు పొందే అవకాశం    కల్పిస్తున్నారు.  
వన్‌స్టాప్‌ సెంటర్‌ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం కాకినాడ, అమలాపురంలో వన్‌స్టాప్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ భార్యభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. గృహ హింసకు పాల్పడితే శిక్షలు, చట్టాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. బాధిత మహిళలకు తాత్కాలికంగా షెల్టర్‌ ఇస్తారు.

గొడవలకు కారణాలివీ..

  •  పని ఒత్తిడిలో భాగస్వామితో సమయం కేటాయించకపోవడం. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో మొదలైన గొడవలు దంపతుల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. 

  • ఎవరికి వారే గొప్ప అనుకునే స్వభావం. చిన్న సమస్యలకు కూడా ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకోవడం.  

  • ఆర్థిక పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు, అనుకోని ఘటనలతో అప్పుల పాలవడం, వాటిని తీర్చే మార్గంలేక ఇంట్లో వారిపై కోపం చూపడం. 

  • సామాజిక మాధ్యమాలు, ఇతర పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీయడం. 

  • ఇంట్లో కుటుంబ కలహాలు.. తల్లిదండ్రులు, అత్తామామలను సరిగా చూసుకోక పోవడం. 

  • సెల్‌ఫోన్‌లో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడుతున్నా భార్య లేదా భర్తపై అనుమానాలు పెంచుకోవడం. 

  • ఇద్దరి మధ్య సమన్వయం లేక పోవడం.  


పరిష్కారాలు ఇలా  

  • సమస్య ఎదురైనపుడు సమన్వయం అవసరం. కోపాలు తగ్గించుకోవాలి. గొడవ సద్దుమణిగేలా ఎవరూ తగ్గకపోవడం..  

  • ఒకరినొకరిపై ప్రేమభావం కలిగేలా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇద్దరం సమానమనే భావన కలిగి ఉండాలి. 

  • ఆదాయ, ఖర్చులు ఇద్దరికి తెలిసే ఉండాలే చూసుకోవాలి. 

  • జీవిత భాగస్వామి ప్రవర్తనకు తగినట్లుగా నడుచుకుంటూ.. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి.. వేర్వేరు కాదు.. ఒకటే అనే భావన ఇద్దరిలో కలగాలి. 

  • పిల్లలతో విహార యాత్రకు వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని చూరం చేసుకోవచ్చు.

వన్‌స్టాప్‌ సెంటర్‌ నంబరు : 181 
పోలీస్‌ హెల్ప్‌లైన్‌ : 112

బాధితులు ముందుకురావాలి : క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. దంపతుల కలహాలు, గృహహింస తదితర బాధితులు ముందుకొచ్చి, పోలీసు స్టేషన్లను సంప్రదించాలి. కుటుంబ సమస్యలతో వచ్చిన భార్యా భర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. సమస్య పరిష్కారం కాకుంటే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం.  – డి.సురేష్‌బాబు, ఎస్సై, రాయవరం   

సానుకూల దృక్పథం అవసరం : జీవన విధానంలో మార్పులు వచ్చాయి. సమస్య చిన్నదే అయినా వ్యతిరేక ఆలోచనలతో ఉంటున్నారు. పరిష్కార మార్గాల వైపు కాకుండా సహనం కోల్పోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పాజిటివ్‌ థింకింగ్‌ అలవర్చుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో అధిక సమయం గడపాలి. – డాక్టర్‌ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం   

ప్రశాంతంగా ఆలోచించాలి  : సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేర సంబంధ ఘటనలను పదేపదే చూడటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మద్యానికి బానిసైన వారిలో మానసిక స్థితి లోపించి భార్యలపై అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదే గొడవలకు, అనర్ధాలకు దారితీస్తాయి. –డాక్టర్‌ అఖిలేంద్ర శ్రీనివాస్, సైకియాట్రిస్ట్, జిల్లా మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్, రాజమహేంద్రవరం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)