Breaking News

Gullamarsu Suresh: ఎవరెస్టుపై నవరత్న కీర్తి

Published on Thu, 05/09/2024 - 08:16

సాక్షి, మచిలీపట్నం: వైఎస్‌ జగన్‌ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నవరత్న పథకాల కీర్తి ఇప్పుడు ఎవరెస్టుపై రెపరెపలాడుతోంది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన గుల్లమర్సు సురేష్ బాబు ఎవరెస్టు బేస్‌ నుంచి ఒక్కో శిఖరాన్ని అధిరోహిస్తూ.. ఒక్కో పర్వతంపై ఒక్కో పథకం ఫ్లెక్సీల్ని ఎగురవేసి సీఎం జగన్‌ ఖ్యాతిని చాటిచెప్పాడు.  వాస్తవాన్ని ఖండాంతరాలకు తెలిజేయాలనుకున్న అతని వజ్ర సంకల్పాన్ని  సీఎం జగన్‌ గతంలో ట్వీట్‌ ద్వారా అభినందించారు. 

ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మా తండ్రి హమాలీ. నేను ఇంటర్‌లో ఉండగా ప్రభుత్వం పర్వతారోహణకు ఆసక్తి ఉన్న వారి పేర్లను కోరింది. ప్రిన్సిపల్‌ ప్రోత్సాహంతో దరఖాస్తు చేశా. 

అంతకుముందు అరికెర హాస్టల్‌లో చదువుకునే రోజుల్లో సీతాఫలం, తేనె కోసం అక్కడున్న 200–300 మీటర్ల ఎత్తయిన కొండలు అవలీలగా ఎక్కేవాడిని. ప్రిన్సిపల్‌ పేర్ల జాబితా పంపాక.. ప్రభుత్వం ఎంపిక చేసి, విజయవాడలో శిక్షణ ఇచ్చింది. అందులో ప్రతిభ చూపిన 35 మందిని ఎంపిక చేసి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ కొండలపై మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 35 రోజులు శిక్షణ ఇచి్చంది.  ఆ తర్వాత పర్వతారోహణను నా హాబీగా మార్చుకున్నా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నవరత్న పథకాలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన ప్రవేశపెట్టిన వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు అద్భుతం.  మా మామ అనారోగ్యంగా ఉంటే రూ.1.50 లక్షల ఖరీదైన వైద్యం ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చేశారు. 

అందుకే నవరత్న పథకాల కీర్తిని చాటిచెప్పాలని భావించా. ఎవరెస్టు బేస్‌ నుంచి ఒక్కో శిఖరంపై ఒక్కో పథకం ఫ్లెక్సీని ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2023 మే 27న నన్ను ఉద్దేశించి ‘నీ అంకితభావం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్‌ చేశారు. అదే సంవత్సరం జూన్‌ 1న కర్నూలు జిల్లా పత్తికొండకు వచి్చనప్పుడు సీఎం జగన్‌ను కలవగా అభినందించారు. మరింత ముందుకు సాగాలని వెన్నుతట్టారు. 

పర్వతారోహణకు సుమారు రూ.35 లక్షలు ఖర్చవుతుంది. నా ఆర్థిక పరిస్థితి తెలిసిన దాతలు, సిల్వర్‌ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు, మిత్రులు సహకారం అందించారు. ఐఏఎస్‌ అధికారి సత్యనారాయణ కూడా సిల్వర్‌ జూబ్లీ పూర్వ విద్యార్థి కావడంతో చేయూత లభించింది. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఐదేళ్లలోనే దేశంలోని 25 శిఖరాలు అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడిగా పేరుపొందడం గర్వకారణం. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికా>ర్డ్స్, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. పర్వతాలు అధిరోహించేటప్పుడు ఐదు సార్లు చావు అంచుదాకా వెళ్లి వచ్చా.  2019 మే 23న మౌంట్‌ లోథ్‌సే ఎక్కుతూ చాలా ఇబ్బంది పడ్డా.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)