Breaking News

కాసులు కురిపిస్తున్న టమాట

Published on Sat, 06/08/2024 - 11:18

కోలారు: టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా రైతులకు మార్కెట్‌లో కాసుల పంట పండుతోంది. రెండు రోజులుగా కోలారు ఏపీఎంసీ మార్కెట్‌లో 15 కిలోల నాణ్యమైన టమాట బాక్సు ధర రూ.700 పలికింది. టోకు మార్కెట్‌లో కిలో ధర రూ.45 నుంచి రూ.50 వరకు ఉంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వేసవి కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌కు పెద్దగా సరుకు రావడం లేదు. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.  ఏపీఎంసీ మార్కెట్‌ యార్డుకు గురువారం 8500 క్వింటాళ్ల టమాట వచ్చింది. 

గత సంవత్సరం ఇదే సీజన్లో మార్కెట్‌కు దాదాపు 15 వేల క్వింటాళ్ల దిగుబడి ఉండింది. ఏప్రిల్‌ నెలలో విపరీతమైన ఎండలు, ప్రస్తుతం కురుస్తున్న వానలకు టమాట దిగుబడి తగ్గుతోందని రైతులు అంటున్నారు. తెగుళ్ల బాధ, వాతావరణ వైపరీత్యం వల్ల కూడా టమాటా దిగుబడి బాగా తగ్గిందని రైతులు అంటున్నారు. వాతావరణంలో మార్పులను చూసి రైతులు కూడా టమాటా సాగుకు విముఖత చూపడం వల్ల దిగుబడి తగ్గిందని ఏపీఎంసీ మార్కెట్‌ యార్డు సెక్రటరీ విజయలక్ష్మి తెలిపారు. రాబోయే 15 రోజుల్లో మార్కెట్‌కు టమాట సరఫరా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. టమాట ధరలు రైతులకు లాభాలు కురిపిస్తుండగా వినియోగదారులకు కన్నీళ్లు           తెప్పిస్తున్నాయి.

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)