Breaking News

భార్యను కాల్చి చంపిన భర్త

Published on Sat, 02/15/2025 - 11:09

సేలం: తెన్‌కాశి సమీపంలో మదునాదపేరి కుళం ప్రాంతంలో ముళ్ల పొదలో ఓ మహిళ కాల్చి చంపిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఘటనా స్థలంలో అనేక మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రత్యేక బృందం పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా విచారణ జరిపారు. అందులో.. ముందు రోజు రాత్రి 9.30 గంటలకు సందేహాస్పదంగా ఒక కారు వెళ్లినట్లు తెలిసింది. ఆ కారు నెంబర్‌ ఆధారంగా జరిపిన విచారణలో... ఆ కారు శివకాశికి చెందిన ఒకరికి సొంతమైనది అని తెలిసింది. 

పోలీసుల విచారణలో శివకాశి భారతి నగర్‌కు చెందిన జాన్‌కిల్‌బర్ట్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను తన భార్యను కాల్చి చంపినట్టు తెలిసింది. వివరాలు.. జాన్‌కిల్‌బర్ట్‌ అదే ప్రాంతానికి  చెందిన కమలి (30) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రులను వ్యతిరేకించి జాన్‌కిల్‌బర్డ్‌ తన ప్రియురాలు కమలినినిపెళ్లి చేసుకున్నాడు. 

వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ స్థితిలో భార్య, భర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ జరిగిన గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన జాన్‌కిల్‌బర్డ్‌ తన భార్య కమలిపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తర్వాత తన సోదరుడి సహకారంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని శంకరన్‌కోవిల్, తిరువెంగడం మార్గంగా తెన్‌కాశికి తీసుకువచ్చి 110 కిలో మీటర్ల దూరం కారులో కమలి మృతదేహాన్నీ తీసుకువచ్చి ఇలదూర్‌ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ముల్ల పొదల్లో కాల్చినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు జాన్‌కిల్‌బర్డ్‌తో పాటూ అతనికి సహకరించిన సోదరుడు తంగతిరుపతిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం రిమాండ్‌కు తరలించారు.  

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)