Breaking News

ప్లాస్టిక్‌ కవర్‌పై ఇడ్లీ చాలా డెడ్లీ

Published on Fri, 02/28/2025 - 09:32

రంగు కలిపిన బొంబై మిఠాయి తింటే ఉదరకోశ రోగాలు, క్యాన్సర్‌ రావచ్చునని గతంలో సర్కారు హెచ్చరించింది. అదే రంగు కలిపిన చికెన్‌ పకోడా, గోబీ ఆరగిస్తే కూడా జబ్బులు తప్పవని హెచ్చరించి రంగులను నిషేధించింది. ఇప్పుడు ఇడ్లీలకు అలర్ట్‌ జారీ అయ్యింది. ప్లాస్టిక్‌ కవర్లు వేసి వండిన ఇడ్లీలను తినరాదని, క్యాన్సర్‌ ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనుక వినియోగదారులు జాగ్రత్త వహించాల్సిందే.

బనశంకరి : ప్రతి ఇంటా, హోటల్‌లో ఇడ్లీలు చేస్తారు, కడుపారా ఆరగించి ఆకలి తీర్చుకుంటారు. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇడ్లీ తగిన ఆహారం. కానీ వండే సమయంలో తప్పుడు విధానాల వల్ల క్యాన్సర్‌కు గురి కావచ్చు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావ్‌ ఇదే విషయం చెప్పారు.  



ప్లాస్టిక్‌ కవర్లు.. ప్రమాదం 
ఇడ్లీలను వండడానికి కొన్ని హోటళ్లలో ప్లాస్టిక్‌ పేపర్లు ఉపయోగిస్తారు, ప్లాస్టిక్‌లో క్యాన్సర్‌ కారకాలు చేరడం వల్ల ఆ ఇడ్లీలను తినడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ నివేదికలు ప్రభుత్వం చేతికి రెండురోజుల్లో అందుతాయని మంత్రి దినేశ్‌ చెప్పారు. ఇటీవలి కాలంలో ఇడ్లీల తయారీలో, వడ్డించడంలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం అధికమైంది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హోటల్స్‌లో, క్యాంటీన్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్‌ కవర్లను వాడరాదని నిషేధం విధించామన్నారు. మరో రెండురోజుల్లో  అధికారిక ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు, పెద్ద పెద్ద హోటల్స్‌లో ఇడ్లీ తయారీలో, పార్శిల్‌ కట్టడంలో ప్లాస్టిక్‌ కవర్లను వాడుతున్నారు. దీనిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. అందులోనే ఇడ్లీ తయారీదారులకు సలహాలు, సూచనలు ఉంటాయన్నారు.  

నమూనాల పరీక్షల్లో వెల్లడి
రాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది బెంగళూరుతో పాటు పలు జిల్లాల నుంచి ఇడ్లీల్లో ప్లాస్టిక్‌ కవర్లు వాడే చోట్ల నుంచి 500 శాంపిల్స్‌ను పరిశీలించారు. ఇందులో 35 నివేదికలు   సాధారణం కాగా పలు నివేదికల్లో క్యాన్సర్‌ కారకాలు బయటపడ్డాయి.  ఇడ్లీలు సులభంగా ఊడి రావడానికి ప్లాస్టిక్‌ పేపర్‌ పరిచి దానిపై ఇడ్లీ పిండి వేసి వేడి చేస్తారు. నిజానికి అక్కడ తెల్ల నూలు బట్టను వాడాలి. ప్లాస్టిక్‌ కవర్‌ అధిక వేడిమి వల్ల ప్రమాదకర రసాయాలను విడుదల చేస్తుంది. అవి కాస్తా ఇడ్లీల్లోకి, ఆపై శరీరంలోకి చేరుతాయి.  దీంతో క్యాన్సర్, గుండెపోటు, ఇతరత్రా అనారోగ్యాలు తలెత్తుతాయి.

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)