మహిళలకు నో టికెట్‌

Published on Wed, 05/31/2023 - 06:26

కర్ణాటక: కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలలో ఒకటైన ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఎలాంటి షరతులు లేవు, ఉచితంగా బస్సుల్లో రాష్ట్రమంతటా ప్రయాణించవచ్చని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మంగళవారం బెంగళూరులో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో 4 ఆర్టీసీ కార్పొరేషన్‌ల అధికారులతో ఆయన సమావేశం జరిపారు. తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి.. ఉచిత బస్సు ప్రయాణానికి ఎలాంటి నియమాలు ఉండవన్నారు.

ఏపీఎల్‌, బీపీఎల్‌ ఏం వద్దు
ఏపీఎల్‌, బీపీఎల్‌ అర్హత ఉండాలని చెప్పలేదని, అందుచేత ఆర్టీసీలో వనితలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. దీనిపై బుధవారం సీఎం వివరాలను ప్రకటిస్తారన్నారు. దీనికయ్యే ఖర్చును, ఆర్టీసీపై పడే భారాన్ని సీఎంకు వివరిస్తానన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులతో పాటు స్త్రీలకు ప్రయాణం ఉచితమే, ఎలాంటి షరతులు ఉండవని చెప్పారు. అన్ని భరోసాలను తాము నెరవేరుస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని తెలిపారు. బీజేపీ నాయకులు గ్యారంటీల గురించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆర్టీసీకి రోజుకు రూ.23 కోట్ల ఆదాయం
కాగా, రాష్ట్రమంతటా నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్‌లలో మొత్తం 23,978 బస్సులు ఉన్నాయి. ఇందులో 1.04 లక్షల సిబ్బంది ఉన్నారు. నిత్యం 82.51 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మొత్తం 240 డిపోలు ఉండగా, ప్రతి రోజు రూ. 23 కోట్ల ఆదాయం వస్తోంది. సంవత్సరంలో రూ.8946 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి వివరించారు.

గ్యారంటీలపై నేడు మళ్లీ సీఎం భేటీ
శివాజీనగర: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాల అమలుపై సీఎం సిద్దరామయ్య వరుసగా అధికారులతో సమావేశాలు జరుపుతున్నారు. జూన్‌ 1 నుంచి అమలు చేయాలని సోమవారం భేటీలో నిర్ణయించారు. ఆ రోజున పథకాల రూపురేఖలు, అర్హుల ఎంపిక పై ప్రకటన చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మా మాట్లాడుతూ ఈ ఐదు గ్యారెంటీ పథకం అమలుకు సంవత్సరానికి రూ.52 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ నిధుల సేకరణకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని విషయమై బుధవారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు విధానసౌధలో సమావేశం నిర్వహిస్తారు.

Videos

వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటే దాడి.. ఏపీలో దాడులపై షర్మిలా రెడ్డి ఫైర్

ప్రియుడితో కలిసి భర్తపై భార్య దారుణం

హైదరాబాద్ లో భారీ వర్షం

ఎంతవరకైనా సిద్ధం..

నో పోలీస్.. నో కేసు.. టీడీపీ, జనసేన దాడులపై పేర్ని నాని ఫైర్..

పోలీసుల ప్రేక్షక పాత్ర కొడాలి నాని షాకింగ్ రియాక్షన్

రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

పేర్ని కిట్టును అడ్డుకున్న పోలీసులు..

ఎన్నికల ఫలితాలపై మార్గాని భరత్ షాకింగ్ రియాక్షన్..

లోక్ సభ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి..

Photos

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)

+5

నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆహ్వానం (ఫోటోలు)

+5

వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ (ఫొటోలు)