Breaking News

సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..

Published on Tue, 10/10/2023 - 11:29

కరీంనగర్‌: కలెక్టరేట్‌ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్‌ కార్డులు, దళిత బంధు, డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్‌లైన్, మాన్యువల్‌గా స్వీకరించారు. కలెక్టర్‌ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్, లక్ష్మీకిరణ్‌ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు.

భూమి విషయంలో బెదిరిస్తున్నడు
ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్‌ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్‌ రూరల్‌

పట్టాదారు పేరు మార్చండి
చల్లూరు గ్రామంలో సర్వే నంబర్‌ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి.
– గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక

వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వాలి
మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్‌. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు.
– బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్‌

వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వాలి
మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్‌. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు.
– బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్‌

పరిహారం ఇయ్యలే..
మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్‌ 271లో ఇంటి నంబర్‌ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు.
– గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)