Breaking News

కుక్కపిల్లలను భయపెట్టాలనుకున్నారు.. కానీ.. తల్లి కుక్క ఎంట్రీతో సీన్‌ రివర్స్‌..

Published on Sat, 07/15/2023 - 10:44

కొత్త వ్యక్తులు కనిపిస్తే కుక్కలు మొరగడం ప్రారంభిస్తాయి. ఇంకా కోపం ఎక్కువ ఉన్న కుక్కలైతే అస్సలు ఊరుకోవు. వెంబడించి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సమయాల్లో బెదిరిస‍్తే కొన్నికుక్కలు భయంతో పారిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది ఇద్దరు యువకులకు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది.

వీడియోలో చూపిన విధంగా.. ఇద్దరు యువకులు దారి వెంట మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారిని చూసిన రెండు కుక్క పిల్లలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. కుక్క పిల్లలే కదా..! అన్నట్లు ఒక్కసారిగా ముందుకు వచ్చి వాటిని బెదిరించే ప‍్రయత్నం చేశారు యువకులు. అంతే.. భయంతో వెనక్కి పరుగులు పెట్టాయి. కానీ అసలు ట్విస్టు ఇక్కడే ఎదురైంది ఆ యువకులకు. వెనక్కి వెళ్లిన కుక్క పిల్లలు తన తల్లిని తీసుకువచ్చాయి. తల్లి కుక్క భారీ ఆకారంలో ఉండటంతో యువకులు.. చచ్చాం.. రా.. బాబోయ్‌.. అన్నట్లు భయంతో వెనక్కి పరుగులు పెట్టారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది.

వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. కుక్క పిల్లలే కదా..! అని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్ చేశారు. దేన్ని అండర్ ఎస్టిమేట్ వేయకూడదని.. దాని వెనకాల ఎంత పెద్ద బలం ఉంటుందో తెలియదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసి మరికొంతమంది నవ్వులు కురిపించారు. కానీ కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరికొందరు.     

ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)