Breaking News

రంజాన్‌ 2023: యెమెన్‌లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం

Published on Fri, 04/21/2023 - 04:28

సనా: యెమెన్‌ దేశంలో పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని స్థానికులకు తలో 7 డాలర్లమేర ఉచిత నగదు పంపిణీ కార్యక్రమం చివరకు ఘోర విషాదంతో ముగిసింది. వందల సంఖ్యలో జనం తరలిరావడం, వారిని అదుపుచేసేందుకు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు గాల్లోకి కాల్పులు జరపడం, ఆ తూటాలు తగిలి విద్యుత్‌ తీగల వద్ద పేలిన శబ్దాలతో భయపడిన పేదజనం పరుగెత్తారు. దీంతో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది.

యెమెన్‌ రాజధాని సనా సిటీలోని ఓ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ తొక్కిసలాటలో చిన్నారులు, మహిళలుసహా 78 మంది ప్రాణాలుకోల్పోయారు.73 మంది గాయపడ్డారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. ఓల్డ్‌సిటీ పరిధిలోని బాబ్‌ అల్‌–యెమెన్‌ ప్రాంతంలోని మయీన్‌ స్కూల్‌లో బుధవారం అర్ధరాత్రివేళ ఈ ఘోరం సంభవించింది. నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో విఫలమవడంతో దాతలైన ఇద్దరు స్థానిక వ్యాపారవేత్తలను అరెస్ట్‌చేశామని హౌతీ రెబల్స్‌ నేతృత్వంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

దారుణ మానవ విపత్తు
2014లో యెమెన్‌ ఉత్తర ప్రాంతంపై పట్టు కోల్పోయిన హౌతీ తిరుగుబాటుదారులు ఆ తర్వాతి ఏడాదే దేశ రాజధానిని తమ వశంచేసుకుని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. అదే ఏడాది గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి ప్రయత్నించినా ఇంతవరకూ సాధ్యపడలేదు. ఆ ఆగ్రహమే పలు మలుపులు తిరిగి నాటి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య శత్రుత్వాన్ని కొనసాగింది. ఇన్నాళ్లలో అక్కడి ఘర్షణల్లో 1,50,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

పెద్ద సంఖ్యలో పౌరులు, సైనికులను పొట్టనబెట్టుకున్న ఈ సంఘర్షణ ప్రపంచంలోనే అత్యంత దారుణ మానవసంక్షోభాల్లో ఒకటిగా నిలిచింది.  2.1 కోట్ల దేశజనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలు అంతర్జాతీయ సాయంకోసం అర్రులుచాస్తున్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి