Breaking News

వీడిన 74 ఏళ్ల మిస్టరీ.. పాన్ యామ్ విమాన శకలాలు గుర్తింపు!

Published on Wed, 07/22/2026 - 12:29

వాషింగ్టన్‌: 74 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన పాన్ యామ్ విమాన శకలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించాయి. 1952లో ప్యూర్టో రికో తీరంలో 69 మంది ప్రయాణికులతో కూలిపోయిన ఈ విమాన ఆచూకీని ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ గుర్తించింది. అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 2,000 అడుగుల లోతులో ఈ శకలాలు రెండు పెద్ద భాగాలుగా చీలిపోయి ఉన్నట్లు జూన్ 2న తాము కనుగొన్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆ సంస్థ వెల్లడించింది.

అధునాతన హై-రిజల్యూషన్ సోనార్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (సముద్ర అంతర్భాగ వాహనం) సహాయంతో ఈ విమానాన్ని కనుగొన్నారు. ఈ ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన అన్వేషణ కోసం డిస్కవరీ ఛానెల్‌కి చెందిన ‘ఎక్స్‌పెడిషన్ అనౌన్’, ‘డీప్ సీ విజన్’ సంస్థలు గతంలో ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తూ వచ్చాయి.

‘క్లిప్పర్ ఎండీవర్’ పేరుతో న్యూయార్క్ నగరానికి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లు విఫలమవడంతో పైలట్ సముద్రంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఆ తర్వాత ప్రయాణికులను ఎలా రక్షించాలనే దానిపై సరైన సమాచారం, సమన్వయం లేకపోవడం, భాషా సమస్యల కారణంగా తీవ్ర గందరగోళం చెలరేగింది. విమానంలో నీరు చేరి కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే అది మునిగిపోయింది.

ఈ విషాద ఘటనే నేడు విమానాలలో మనం చూస్తున్న భద్రతా ప్రమాణాలకు పునాది వేసింది. విమానం టేకాఫ్ అయ్యే ముందు ఫ్లైట్ అటెండెంట్లు ప్రదర్శించే సేఫ్టీ బ్రీఫింగ్స్ అప్పట్లో ఈ ప్రమాదం తర్వాతే ప్రారంభమయ్యాయి. సివిల్ ఏరోనాటిక్స్ బోర్డు దీనిని తప్పనిసరి చేసింది.

ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రస్ మాథ్యూస్ పాత ప్రమాద నివేదికలను పరిశోధించి, 2019లో శాన్ జువాన్ తీరంలో పలు సర్వేలు నిర్వహించడంతో ఈ అన్వేషణ మళ్లీ ఊపందుకుంది. ‘ఎక్స్‌పెడిషన్ అనౌన్’ బృందంతో కలిసి చేసిన అన్వేషణలో కీలక క్లూస్ లభించాయి. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు తయారు చేసిన మ్యాప్ ఆధారంగా, రీసెర్చ్ వెసెల్ సహాయంతో అండర్ వాటర్ డ్రోన్‌ను ఉపయోగించి మొదటి ప్రయత్నంలోనే ఈ శకలాలను గుర్తించారు. ఈ ఫొటోలలో పాన్ అమెరికన్ లోగో, విమానం పేరు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)