Breaking News

World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత

Published on Wed, 11/27/2024 - 08:30

లండన్‌: ప్రపంచంలోనే అత్యంత కురు వృద్ధుడిగా తొమ్మిది నెలలపాటు కొనసాగిన జాన్‌ ఆ్రల్ఫెడ్‌ టిన్నిస్‌వుడ్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 112 ఏళ్లు. లివర్‌పూల్‌లోని వృద్ధాశ్రమంలో సోమ వారం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబం తెలిపింది. 

టిన్నిస్‌వుడ్‌ లివర్‌పూల్‌లో 1912 ఆగస్ట్‌ 26వ తేదీన జని్మంచారు. ఆగస్ట్‌లో 112వ జన్మదినం జరుపుకున్నారు. ఇంత సుదీర్ఘ కాలం జీవించడం కేవలం అదృష్టమని చెప్పే టిన్నిస్‌వుడ్‌.. మనం ఎక్కువ కాలం జీవించాలా, స్వల్ప కాలమా అన్నది మన చేతుల్లో లేదని ఆయన తెలిపేవారని కుటుంబం గుర్తు చేసింది. 

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా టిన్నిస్‌వుడ్‌ పేరు ఈ ఏడాది ఏప్రిల్‌లో గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది. బ్రిటిష్‌ ఆర్మీ పే కార్ప్స్‌లో సైనికుడిగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రెండు ప్రపంచయుద్ధాలు ఆయన జీవితకాలంలోనే జరిగాయి. టిన్నిస్‌వుడ్‌కు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మునిమనవలు ఉన్నారు. భార్య బ్లోడ్‌వెన్‌ 1986లో చనిపోయారు.   

#

Tags : 1

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)