Breaking News

Year Ender 2024: వణికించిన విమాన ప్రమాదాలు

Published on Thu, 12/26/2024 - 08:58

2024 ముగియడానికి ఇక కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంతలోనే కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఏడాది అధికంగానే విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

జపాన్ విమాన ప్రమాదం
2024 జనవరి 2న జపాన్‌లోని టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 516- జపాన్ కోస్ట్ గార్డ్ విమానం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ‍ప్రమాదంలో విమానంలోని మొత్తం 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు. అయితే కోస్ట్ గార్డ్ విమానంలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు మృతిచెందారు.

బెల్గోరోడ్ ఓబ్లాస్ట్ విమాన ప్రమాదం
2024, జనవరి 24న బెల్గోరోడ్ ఒబ్లాస్ట్‌లో రష్యన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్ ఐఎల్‌ 76 సైనిక రవాణా విమానం కూలిపోయింది. ఈ విమానంలో 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలతో పాటు తొమ్మిదిమంది సిబ్బంది ఉన్నారు. వీరంతా మృతిచెందారు.

రష్యా విమాన ప్రమాదం
2024, మార్చి 12న రష్యాలోని ఇవానోవో ఒబ్లాస్ట్‌లో ఇల్యుషిన్  ఐఎల్‌76 కార్గో విమానం కూలిపోయింది. దీంతో ఆ విమానంలోని మొత్తం 15 మంది మృతిచెందారు.

ఇరాన్ విమాన ప్రమాదం
2024, మే 19న ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా మొత్తం తొమ్మిది మంది  మృతిచెందారు.

మలావి విమాన ప్రమాదం
2024, జూన్ 10న మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా, ఇతర ప్రముఖులతో ప్రయాణిస్తున్న మలావీ డిఫెన్స్ ఫోర్స్ డోర్నియర్- 228 విమానం కూలిపోవడంతో అందులోని తొమ్మిది మంది మృతిచెందారు.

నేపాల్ విమాన ప్రమాదం
2024, జూలై 24న నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కొద్దిసేపటికే  కుప్పకూలింది. అందులో ఉన్న 19 మందిలో 18 మంది మృతిచెందారు.

విన్‌హాడో విమాన ప్రమాదం
2024, ఆగస్ట్ 9న బ్రెజిల్‌లోని సావోపాలోలోని విన్‌హెడోలో ఫ్లైట్- 2283 క్రాష్ అయ్యింది. అందులో మొత్తం 62 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఇది బ్రెజిల్‌లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.

బ్రెజిల్ విమాన ప్రమాదం
2024, డిసెంబర్ 22న బ్రెజిల్‌లోని కెనెలా విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైపర్ పీఏ42 చెయెన్నే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రయాణికులు మృతిచెందారు. 17 మంది గాయపడ్డారు.

కజకిస్తాన్ విమాన ప్రమాదం
2024, డిసెంబర్ 25న అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో కూలిపోయింది. క్రిస్మస్ రోజున జరిగిన ఈ విమాన ప్రమాదంలో 38 మంది మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్‌ స్టార్స్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)