Breaking News

ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ డే: ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతోందో తెలుసా?

Published on Mon, 10/16/2023 - 13:09

World Food Day 2023: ప్రపంచ ఆహార దినోత్సవం 2023: సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా  కష్టాలుపడుతున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల  కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ప్రపంచ  ఆహార దినోత్సవం  సందర్భంగా ఈ భూమ్మీద ప్రతి వ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా  కొన్ని ఇంట్రస్టింగ్‌ సంగతులు మీకోసం..

1979లో, FAO సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవుదినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి.  2023 వరల్డ్‌ ఫుడ్‌ డే ధీమ్‌ ఏంటంటే  ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ  ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా  సాధ్య పడుతుందా?  అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం  చాలా అవసరం.  ప్రపంచ జనాభాలో ఎంతమందికి  కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం  వృథా అవుతోంది మీకు తెలుసా?

మీకు తెలుసా...
►ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ డేను ఆచరిస్తున్నాం.
► ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత కూడా లేదు.
►ఇజ్రాయెల్‌ - పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్‌ల మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది.
►అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది.
► కోవిడ్‌-19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. 

► ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు.
►ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్‌ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే.
►మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. మనోవ్యాకులత (డిప్రెషన్‌) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు.

ఇవీ చదవండి: ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు
ఆకలి సూచీలో అధోగతి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)