Breaking News

మెట్రో స్టేషన్‌లో మహిళ ప్రసవం.. అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అధికారులు

Published on Fri, 01/23/2026 - 23:35

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అల్ అందలస్ మెట్రో స్టేషన్‌లో మెట్రో స్టేషన్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల రాకపోకలతో నిత్యం బిజీగా ఉండే మెట్రో స్టేషన్.. ఒక కొత్త ప్రాణానికి పురుడు పోసిన వేదికగా మారింది. అల్ అందలస్ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రియాద్ మెట్రో చరిత్రలో స్టేషన్ ఫరిధిలో ఒక శిశువు జన్మించడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని రియాద్ మెట్రో అధికారికంగా ప్రకటించింది.

ఏం జరిగిందంటే?
ఓ గర్భిణీ మహిళ స్టేషన్‌లో ఉన్న సమయంలో  అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. విషయం గమనించిన మెట్రో ఆపరేషన్స్ టీమ్ తక్షణం స్పందించింది. వెంటనే అంబులెన్స్‌కు సమచారమిచ్చారు. అయితే అంబులెన్స్ వచ్చేందుకు సమయం పట్టనుండడంతో స్టేషన్‌లోని మహిళా సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. దీంతో సదరు మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అదరిపోయే గిఫ్ట్‌
అయితే ఈ సందర్భంగా రియాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బిడ్డ తల్లిదండ్రులకు ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే రెండు ఫస్ట్ క్లాస్ 'దర్బ్' కార్డులను మెట్రో గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో వారు సంవత్సరం పాటు మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా అత్యవసర సమయంలో స్పందించి ప్రసవం చేసిన సిబ్బందిని అధికారులు ప్రశంసించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)