Breaking News

అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?

Published on Thu, 08/24/2023 - 08:19

1960 దశాబ్ధంలో చంద్రునిపైకి వ్యోమగాములను తీసుకెళ్లిన సాటర్న్ వీ నుండి నేటి ఫాల్కన్ 9 లేదా ఏరియన్ 5 వరకు చాలా రాకెట్లు తెలుపు రంగులోనే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్న సైన్స్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

రాకెట్లు ప్రధానంగా తెలుపు రంగులోనే ఉంటాయి. ఫలితంగా అంతరిక్ష నౌక వేడిగా మారదు. అలాగే లాంచ్‌ప్యాడ్‌పై, ప్రయోగ సమయంలో సూర్యుని రేడియేషన్‌కు గురికావడం వల్ల దానిలోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్‌లకు వేడి నుండి రక్షణ దొరుకుతుంది. అధికశాతం అంతరిక్ష నౌకలలో చల్లని ప్రొపెల్లెంట్లను ఉపయోగిస్తారు. చాలా రాకెట్ల మొదటి దశలలో ఉపయోగించే ఆర్‌పీ-1 ఇంధనంతో పాటు, దాదాపు అన్ని ఇతర ద్రవ ప్రొపెల్లెంట్లు క్రయోజెనిక్ పదార్థాలై ఉంటాయి. వీటిని ద్రవ రూపంలో ఉంచడానికి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఎంతో అవసరం.

ఉదాహరణకు రాకెట్ ఎగువ దశలలో ఉపయోగించే ద్రవ హైడ్రోజన్ -253 ° C (-423 ° F) కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు తీసుకురావలసి ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్, ద్రవ ఇంధన రకాలతో ఉపయోగించే ఆక్సిడైజర్ -183°C (-297°F) వరకూ చల్లబరిచేలా చూడటం అత్యవవసరం. ఈ ప్రొపెల్లెంట్లను లాంచ్ వెహికల్‌లోకి పంప్ చేసిన తర్వాత, శీతలీకరణకు మరో మార్గం ఉండదు. అందుకే అవి వేడెక్కడం జరుగుతుంది. 

దీని వెనుకగల కారణం ఏమిటంటే పలు రాకెట్‌ ప్రయోగ కేంద్రాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలోనే ఉన్నాయి. ఇక్కడ వెచ్చని వాతావరణం వేడి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇప్పుడు  రాకెట్లు ఎందుకు తెలుపు రంగులో ఉంటాయో అర్థమయ్యే ఉంటుంది. స్పెక్ట్రమ్‌లోని అన్ని రంగులలో తెలుపు రంగు అనేది సూర్యకాంతి నుంచి వచ్చే వేడిని గ్రహించకుండా చూడటంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.

ఎండ అధికంగా ఉన్న రోజున  తెలుపు రంగు చొక్కా ధరించి, బయట తిరిగినప్పుడు ఈ దృగ్విషయాన్ని ఎవరైనా గమనించవచ్చు. రాకెట్ ఇంజనీర్‌లు ఈ దృగ్విషయాన్ని ఆధారంగా చేసుకుని.. రాకెట్‌ అంతర్గత ట్యాంకుల్లోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్‌లు వేడెక్కడాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అందుకే లాంచ్ వెహికల్‌కి తెల్లని పెయింట్ వేయడం చవకైన మార్గం అని గుర్తించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం!

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)