Breaking News

వణికిస్తున్న మంకీపాక్స్‌కు చెక్‌.. వ్యాక్సిన్‌ విడుదల

Published on Fri, 09/13/2024 - 19:16

జెనీవా: ప్రపంచదేశాలను ప్రస్తుతం మంకీపాక్స్‌ వణికిస్తోంది. ఆఫ్రికాతో పాటు వివిధ దేశాల్లో మంకీపాక్స్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దవారిలో ఎంపాక్స్‌ నిరోధానికి రూపొందించిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.

కాగా, పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్‌ నుంచి రక్షించడానికి బవేరియన్ నార్డిక్ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆఫ్రికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నందున వ్యాప్తిని అరికట్టడంలో ఇది సహాయపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు-డోస్ ఇంజెక్షన్‌గా ఇవ్వవచ్చని, వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎనిమిది వారాల వరకు ఉంచవచ్చని వెల్లడించింది. ఇక, తయారీ సంస్థ ఒక్కటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరుగుతోంది. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్‌ అందించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.

మరోవైపు.. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, మొదటి డోస్‌లో  76 శాతం ప్రభావాన్ని కలిగి ఉందని తెలుస్తుంది. తరువాత రెండో డోస్‌ 82 శాతం ప్రభావాన్ని కలిగి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. అంటువ్యాధులను నివారించడానికి, వ్యాప్తిని ఆపడానికి, ప్రాణాలను రక్షించడానికి, వ్యాక్సిన్‌లు అత్యంత అవసరం అని అన్నారు.

 

 

ఇది కూడా చదవండి: గూఢచర్యం ఆరోపణలు..బ్రిటన్‌ దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)