Breaking News

విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!

Published on Sat, 06/14/2025 - 11:29

మీరు విన్నది నిజమే.. ఈ విమానం కూలిపోలేదు.. కూల్చేశారు.ఎందుకో తెలుసా? విమానంలో ఏ సీట్లు సేఫ్‌ అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం..

అయితే, ఇది జరిగింది ఇప్పుడు కాదు.. 2012లో.. ఆ విమానం కూడా బోయింగ్‌ కంపెనీదే.. 

తాజా విమాన ప్రమాదంలో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 11ఏ సీటులో కూర్చున్న రమేశ్‌ మృత్యుంజయుడిలా తిరిగొచ్చిన నేపథ్యంలో 2012లో ఏం జరిగిందన్న విషయం మీ కోసం.. 

మెక్సికోలోని సొనొరన్‌ ఎడారి.. విమానాలు కూలిపోయినప్పుడు ఏ సీట్లు సేఫ్‌ అన్న విషయాన్ని తెలుసు కోవడం కోసం ఓ ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు అనుకున్నారు. దీన్ని డాక్యుమెంటరీగా తీయడానికి ముందుకొచ్చిన చానెల్‌ 4,  డ్రాగన్‌ ఫ్లై అనే టెలివిజన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ.. అప్పట్లోనే దీని కోసం రూ. 13 కోట్లు ఖర్చుపెట్టాయి. విమానంలో కెమెరాలు, సెన్సర్లు అమర్చారు.  ప్రమాద సమయంలో మనుషుల్లో ఏయే ఎముకలు విరిగే చాన్సుందో తెలుసుకోవడానికి మన ఎముకల నిర్మాణం ఎలా ఉంటుందో అలాంటివే కలిగిన డమ్మీ బొమ్మలను ఉంచారు. 

వాటిని మూడు రకాల పొజిషన్లలో కూర్చోబెట్టారు. ఒకటి.. సీటు బెల్ట్‌ పెట్టుకుని, బ్రేస్‌ పొజిషన్‌ (క్రాష్‌ ల్యాండింగ్‌ టైంలో ఇదే సురక్షితమైన పొజిషన్‌)లో, రెండు.. బెల్ట్‌ పెట్టి.. మామూలుగా కూర్చోబెట్టారు. మూడు.. బెల్ట్‌ లేకుండా.. బ్రేస్‌ పొజిషన్‌లో కాకుండా మామూలుగా కూర్చోబెట్టారు. ఆ బోయింగ్‌ 727 విమానాన్ని 2,500 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాక.. పైలట్‌ పారాచూట్‌ ద్వారా బయటకు దూకేశాడు. తర్వాత ఆ విమానాన్ని వెనుక చిన్నపాటి విమానంలో వస్తున్న పైలట్‌ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడిపి, కూల్చేశాడు. 

బిజినెస్‌ క్లాస్‌.. భద్రత పెరగదు..
బిజినెస్‌ క్లాస్‌కు రేటెక్కువ చెల్లించినంత మాత్రాన.. దానికి తగ్గట్లు భద్రత పెరగదని ఈ పరిశోధనలో తేలింది. విమానం కూలితే.. మిగిలినవారితో పోలిస్తే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు దగ్గర్లో ఉండే.. ఎకానమీ క్లాసులోని వారే బతికే అవకాశాలు ఎక్కువని నిర్ధారణ అయింది. ఇందులో తొలి 11 వరుసల సీట్లు పూర్తిగా చిన్నాభిన్నమైపోయాయి. ఈ సీట్లలో ఎవరూ బతికే అవకాశం లేదని తేల్చారు. వెనుక ఉన్న సీట్లలో 75% మంది (విమానం పేలిపోలేదు గనుక) బతికే అవకాశముందని శాస్త్ర వేత్తలు చెప్పారు. 

చ‌ద‌వండి: విమానంలో 11ఏ సీటును ఎందుకు ఇష్ట‌ప‌డ‌రో తెలుసా?

కూలిన ప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌ బాడీ ఎంత తీవ్ర తను తట్టుకోగలదు అన్న విషయాన్నితెలుసుకోవడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడిందని తెలిపారు. అప్పటి 727 బ్లాక్‌ బాక్స్‌ సమాచారాన్ని విశ్లేషించిన అన్నే ఇవాన్స్‌.. అప్పటితో పోలిస్తే.. ఇప్పటి విమానాల్లో భద్రత బాగా పెరిగిందని చెప్పారు. అయితే.. తనను విమానంలో సీటు ఎంచుకోమన్నా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు దగ్గర్లో ఉన్న వరుసల్లోని సీటునే ఎంచుకుంటానని చెప్పారు. 2012 కన్నా ముందు.. ఇలాంటి పరీక్షనే 1984లో బోయింగ్‌ 720 విమానంతో నాసా నిర్వహించింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)