Breaking News

సెల్యూట్‌ కొట్టే వాళ్లూ లేకుండా పోతారు!

Published on Thu, 04/03/2025 - 17:20

పొరుగూరు వెళ్లి లాడ్జిలో దిగారనుకోండి.. వచ్చేటప్పుడు పోయేటప్పుడు తలుపులు తీసి.. దర్బాన్లు మనకు సెల్యూట్‌ చేస్తూంటే.. మన మనసు మూలల్లో ఎక్కడో ఒకచోట గర్వంగా ఫీల్‌ అవుతూంటాం! థ్యాంక్స్‌ టు రోబోటిక్స్‌ ఇప్పుడు ఈ చిన్ని ఆనందానికీ మనం దూరం కావల్సిందే! ఎందుకంటారా...?

రోబో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనకు ఉద్యోగాలు తక్కువైపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వినపిస్తున్నదే. తాజా నిదర్శనం.. చైనీస్‌ కంపెనీ పుడు రోబోటిక్స్‌ అభివృద్ధి చేసిన ఫ్లాష్‌బోట్‌! మనిషి మాదిరిగానే ఎంచక్కా రెండు కాళ్లపై నడవడం మాత్రమే దీని ప్రత్యేకత కాదు. హోటళ్లు తదితర భవనాల్లో తలుపులు తీయడం, వేయడం... లాడ్జీల్లోనైతే వచ్చిన అతిథి సామాను మోసుకుని గది చూపించడం కూడా చేసేస్తుంది ఇది.

ఫొటోలు చూడండి.. ఎంత వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉందో ఈ ఫ్లాష్‌బోట్‌. చేయి చాచితే మాత్రం ఆరు అడుగుల దూరంలోని వస్తువులను కూడా ఒడుపుగా పట్టుకోగలదు ఇది. ఇందుకు తగ్గట్టుగా పుడు రోబోటిక్స్‌ అత్యాధునిక డీహెచ్‌11 రోబో చేతులను అమర్చింది దీనికి. ఎత్తు తక్కువగా ఉన్నా లిఫ్ట్‌లలో సులువుగా బటన్స్‌ నొక్కేందుకు, వస్తువులను పట్టుకునేందుకు ఈ పొడవాటి చేతులు ఉపయోగపడతాయి అన్నమాట. ఛాట్‌జీపీటీ వంటి లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ పుణ్యమా అని ఈ ఫ్లాష్‌బోట్‌ గొంతు కూడా అచ్చం మనిషిని పోలి ఉంటుంది. చెప్పే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోగల సామర్థ్యమూ అబ్బింది. కాబట్టి ప్రత్యేకమైన సైగలు, బటన్స్‌ నొక్కే అవసరం లేకుండా చేయాల్సిన పనిని మనమే నేరుగా చెప్పేయవచ్చు.

ఫ్లాష్‌బోట్‌ ముఖ భాగంలో పెద్ద టచ్‌స్క్రీన్‌ ఉంటుంది. దాంట్లో అమర్చిన సెన్సర్ల సాయంతో ఇది తన పరిసరాలను స్కాన్‌ చేయగలదు. ఏది ఎక్కడుందో గుర్తించేందుకు ఆర్జీబీ డెప్త్‌ కెమెరాలు, పానోరామిక్‌ కెమెరాలు, త్రీడీ మ్యాపుల కోసం, అడ్డంకులను గుర్తించి తప్పించుకునేంఉదకు లైడార్లు కూడా ఉన్నాయి దీంట్లో. హోటళ్లలో ఈ రోబోను వాడితే అతిథుల సామాన్లు మోసేందుకు ప్రత్యేకమైన క్యాబిన్‌లాంటిది కూడా ఉంటుంది. ఫలితంగా రోబో చేతులను ఇతర పనులకు వాడవచ్చు. ఫ్లాష్‌బోట్‌ ఒకొక్కటి సుమారు 15 కిలోల బరువుంటుంది. నాలుగు గంటలపాటు ఛార్జ్‌ చేస్తే ఎనిమిది గంటలపాటు పనిచేయగలదు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఖరీదెంత? వంటి వివరాలు కావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.


(ఫొటోలు, వీడియోలు పుడు రోబోటిక్స్‌ సౌజన్యంతో)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)