Breaking News

ఐస్‌లాండ్‌లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం

Published on Wed, 04/02/2025 - 04:51

లండన్‌: అట్లాంటిక్‌ సముద్ర ద్వీప దేశం ఐస్‌లాండ్‌లో మరోసారి అగ్ని పర్వతం బద్దలైంది. రెక్జానెక్‌ ద్వీపకల్పంలోని గ్రిండావిక్‌ పట్టణ సమీపంలోని అగ్ని పర్వతం నుంచి భారీగా లావా, పొగలు చిమ్ముతుండటంతో మంగళవారం అధికారులు అక్కడున్న 40 నివాసాలను ఖాళీ చేయించారు. 

ఐస్‌లాండ్‌లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా ఉన్న బ్లూ లగూన్‌ జియోథర్మల్‌ స్పాను మూసివేశారు. దాదాపు 800 ఏళ్ల పాటు నిద్రాణంగా ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా లావా పెల్లుబకడంతో గతేడాదే ఇక్కడున్న వారందరినీ వేరే చోటుకు తరలించారు. 

ఉదయం 6.30 గంటలకు లావా ప్రవాహం మొదలై గ్రిండావిక్‌కు ఉత్తరంగా ఏర్పాటు చేసిన రక్షణ బారియర్‌ను దాటుకుని 500 మీటర్ల పొడవున ప్రవహిస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర అట్లాంటిక్‌లోని అగ్ని పర్వతాలకు కేంద్రమైన ప్రాంతంలో ఐస్‌లాండ్‌ ఉంది. 2010లో ఇక్కడి అగ్ని పర్వతం విస్ఫోటంతో భారీగా వాతావరణంలోకి వెదజల్లిన బూడిద మేఘాలు కొన్ని నెలలపాటు అట్లాంటిక్‌ మీదుగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగించాయి.

#

Tags : 1

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)